ఆరోగ్యం

Health tip : గ్యాస్, అజీర్తి సమస్యలు వేధిస్తున్నాయా? ఈ ‘టీ’ తాగితే మెడిసిన్ అక్కర్లే!

నిద్రలేని రాత్రులు, వేళ కాని వేళలో ఫుడ్ తీసుకోవడం, అందులోనూ జంక్ ఫుడ్ అధికంగా తినడం, తగినంత నీటిని తీసుకోకపోవడం, వాకింగ్, రన్నింగ్ లాంటి ఫిజికల్ వ్యాయామాలు లేకపోవడంతో చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు.కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో నరకం చూస్తున్నారు.

నిద్రలేని రాత్రులు, వేళ కాని వేళలో ఫుడ్ తీసుకోవడం, అందులోనూ జంక్ ఫుడ్ అధికంగా తినడం, తగినంత నీటిని తీసుకోకపోవడం, వాకింగ్, రన్నింగ్ లాంటి ఫిజికల్ వ్యాయామాలు లేకపోవడంతో చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు.కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో నరకం చూస్తున్నారు. హాస్పిటల్స్ వెళ్లి రూ. లక్షలు తగలేసినా వారికి ఉపశమనం లభించడం లేదని తెలుస్తోంది. అలాంటి వారికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందని నిపుణులు చెబుతున్నారు. హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం వంటింట్లో దొరికే స్పైసెస్‌తో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

దాల్చిన చెక్కతో డికాషన్..

దాల్చిన చెక్క (Cinnamon) డికాషన్ తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating),అజీర్తి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు స్పష్టంచేస్తున్నారు. దాల్చిన చెక్కలో ఉండే సహజ నూనెలు (ముఖ్యంగా సిన్నమాల్డిహైడ్) జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.

గ్యాస్ట్రిక్ సమస్యలపై ఎలా పనిచేస్తుంది?

జీర్ణ రసాల ఉత్పత్తి : దాల్చిన చెక్క కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా అరిగి, కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. దాంతో ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుంది.

కడుపు ఉబ్బరం తగ్గింపు: ఇందులో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ (Anti-spasmodic), యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులోని కండరాల నొప్పిని, మంటను తగ్గించి, పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి.ఫలితంగా కడపు ఉబ్బరం, నొప్పి తగ్గుతాయి.ముఖ్యంగా అసిడిటి, అల్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను సైతం మెరుగుపరుస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తయారీ విధానం..

ఒక గ్లాసు నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క (సుమారు అంగుళం) వేసి, నీరు సగానికి మరిగే వరకు ఉడికించి వడకట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు (కావాలంటే కొద్దిగా తేనె కలుపుకుని) భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత తాగవచ్చు.

జాగ్రత్తలు : దాల్చిన చెక్క వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు. కడుపులో అల్సర్లు ఉన్నవారు, గర్భిణీలు, లేదా కాలేయ సంబంధిత సమస్యలు, రక్తం పలుచబడే మందులు వాడేవారు వైద్యుల సలహా తర్వాతే దీనిని తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యానికి చాలా ఉపయోగం..

రక్తంలో చక్కెర నియంత్రణ : ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా రక్తంలోని షుగర్ స్థాయులను అదుపులో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది.

బరువు తగ్గడం (మెటబాలిజం): శరీరంలోని జీవక్రియ (Metabolism) వేగాన్ని పెంచి, అదనపు కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి : ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గుండె ఆరోగ్యం: చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో కొంతవరకు ఉపయోగపడుతుందని తెలిసింది.

తర్వాత చదవండి