NBK112: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్లకు ఎప్పుడూ మంచి బజ్ ఉంటుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ లో సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. ఈ కాంబోకి సంబందించిన న్యూస్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొరటాల శివ సిద్ధం చేసిన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
గతంలో కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, దేవర లాంటి సినిమాలు బలమైన కథాంశం, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొరటాల కెరీర్‌లో ఫ్లాప్ అంటే ఒక్క ఆచార్య మాత్రమే. ఇక, బాలకృష్ణ విషయానికి వస్తే..సింహ నుంచి గత చిత్రం అఖండ వరకూ వరుసగా పవర్‌ఫుల్ పాత్రలు, మాస్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడుతూ వస్తున్నాడు. ఇప్పుడు, ఈ ఇద్దరూ కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి నందమూరి అభిమానుల్లో సహజంగానే ఉంటుంది.
ముఖ్యంగా, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా కొరటాల శివ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో, బాలకృష్ణను కొత్త తరహా పాత్రలో చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ కథను, కొరటాల స్టైల్ మేకింగ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ కొట్టేలా అన్నీ అంశాలను పుష్కలంగా జత చేసి స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం, బాలయ్య దాదా చిత్రాన్ని పూర్తి చేసేపనిలో ఉన్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని, తర్వాత కొరటాల-బాలయ్య ప్రాజెక్ట్ లైన్‌లోకి రానుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్మ్ సహా మిగతా వివరాలను ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజు వెల్లడించనున్నారు.
