Vijay Devarakonda: కొన్ని సినిమాలు టైటిల్ అండ్ కాంబినేషన్‌తోనే ఆసక్తిని పెంచుతాయి. అలాంటి సినిమా ‘రౌడీ జనార్ధన’. ఈ సినిమా షూటింగ్లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణను కొనసాగిస్తూ, చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను మహారాష్ట్రలో ప్లాన్ జరుపుతున్నారు. దర్శకుడు రాసుకున్న కథకు అవసరమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
విజయ్ దేవరకొండను ఇప్పటివరకు చూడని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు రవికిరణ్ కోలా ఆయన పాత్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ముఖ్యంగా, ఈ సినిమాను 1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంతో రూపొందిస్తున్నారు. దీనికోసం కొన్ని భారీ సెట్స్ కూడా నిర్మించారు. ఇక, లేటెస్ట్ షెడ్యూల్ మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజయ్ తో పాటు మరికొంతమంది నటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
విజయ్‌కు జోడీగా కీర్తి సురేష్..
కాగా, రౌడీ జనార్ధన సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో..ఈ క్రేజీ కాంబినేషన్ మీద అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే, ఈ సినిమా కోసం విజయ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఇక, ఈ సినిమాలో భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర బృందం నమ్మకంగా చెప్తోంది. విజయ్ను కూడా కొత్త తరహా మాస్ క్యారెక్టర్లో చూడాలని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, గత చిత్రం రణబాలి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చాలా శ్రమించారు. కానీ, దర్శకుడు సరిగ్గా ఈ కథను డీల్ చేయలేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
