Congress Vs Brs: హైదరాబాద్ చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బొమ్మతో బావర్చి హోటల్ లో డిన్నర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకుని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. వారి డిన్నర్ ప్రోగ్రామ్ ను అడ్డుకుని దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
తెలంగాణ
Congress Vs Brs: చిక్కడపల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ
హైదరాబాద్ చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు.
