సినిమా

Naga Chaithanya-Meenakshi: దైవ దర్శనాలలో హీరోహీరోయిన్లు..

Naga Chaithanya-Meenakshi: మన టాలీవుడ్ సినీ తారలే కాకుండా ఇతర సౌత్ భాషలలోను సినీ తారలు కూడా తిరుమల వెంకన్న స్వామి వారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, సినీ తారలు తాము నటించిన సినిమాల విడుదలకి ముందు ఇలా దైవ దర్శనాలకి వెళుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా, అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి దైవ దర్శనాలతో సందడి చేశారు.

శ్రీకాళహస్తిలో చైతూ:

అక్కినేని నాగ చైతన్య శ్రీకాళహస్తిలోని శివాలయాన్ని దర్శించుకున్నారు. తాజాగా, దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు, తన ప్రతీ సినిమాకి అక్కినేని హీరోలు ఇలా దైవ దర్శనాలకి వెళుతుంటారు. అలాగే, చైతూ కూడా ఇప్పుడు శ్రీకాళహస్తిలో శివుడిని దర్శించుకున్నారు. ఆయల సిబ్బంది ఆయనకి ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సన్నిధిలో మీనాక్షి:

హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవేంకటేశర స్వామివారిని దర్శించుకున్నారు. మీనాక్షి ఇంతకముందు కూడా ఆమె నటించిన సినిమాలు విడుదలకి ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకి ముందు చిత్రబృందం కలిసి ఆమె ఆ శ్రీనివాసుడిని దర్శకించుకున్నారు.

చైతూ-మీనాక్షి నటించిన వృష కర్మ:

అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా వృష కర్మ. ఈ సినిమా డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి. వీరిద్దరు తాము నటించిన వృష కర్మ సూపర్ హిట్ అవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

తర్వాత చదవండి