సినిమా

Alias Rukmini-Trailer: ఈసారి నితిన్ ఖాతాలో హిట్ పక్కా..

Alias Rukmini-Trailer: మన టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ సినిమాలో నితిన్, ఆఫియా సయ్యద్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే గ్యారెంటీగా ఈసారి నితిన్ ఖాతాలో హిట్ పక్కా పడుందని నమ్మకం కలుగుతోంది.

ఈ సినిమాకి ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహించాడు. భారీ స్థాయిలో డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా..ఇది, అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

‘ది మ్యాంగో కింగ్’ అనే నాటక ప్రకటనతో మొదలయ్యే అలియాస్ రుక్మిణి 3 నిమిషాల ట్రైలర్.. కృష్ణ (నితిన్) అనే మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితాన్ని పరిచయం చేస్తుంది. ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు కృష్ణ. అందరిలో ఎంతో అమాయకంగా, తన జీవితం ఒక తెరిచిన పుస్తకంలా అనిపిస్తాడు. కానీ, ఆ అమాయకత్వం వెనుక ఓ పెద్ద సీక్రెట్ దాగి ఉంటుంది. ఇంతకమందున్న టైప్‌రైటర్‌పై ‘రుక్మిణి’ అనే లేడీ రైటర్ కలం పేరుతో ‘కోరికలే గుర్రాలైతే’, ‘మిస్టర్ వీర్య’ వంటి బోల్డ్, రొమాంటిక్ పుస్తకాలు రాస్తూ పాపులర్ అవుతాడు కృష్ణ.

ఈ క్రమంలో స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న రుక్మిణి (ఆఫియా సయ్యద్)తో కృష్ణకు పెళ్లి నిశ్చయమతుంది. పెళ్లి చూపుల్లో వీరిద్దరూ తమకు వచ్చిన రిజెక్షన్ల గురించి మాట్లాడుకునే సీన్స్, పెళ్లి తర్వాత వారి మధ్య సాగే సున్నితమైన డైలాగులు బాగా ఆకట్టుకుంటాయి. అయితే, కృష్ణ రాసే సీక్రెట్ పుస్తకాల మ్యాటర్ బయటపడటంతో వీరి వైవాహిక జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. “ఇప్పుడు మిమ్మల్ని కృష్ణ అని పిలవాలా, లేక రుక్మిణి అని పిలవాలా?” అని హీరోయిన్ నిలదీసే సీన్ కథలోని అసలు టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది.

మొత్తానికి, తాజాగా వచ్చిన అలియాస్ రిక్మిణి ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గ్యారెంటీగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు..యూత్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని అర్థమవుతోంది. చూడాలి, మరి ఈ సినిమాతోనైనా నితిన్‌కి సాలీడ్ హిట్ పడి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో.

YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి