DaDa: షెహరంతా అదిరిపోవాలి….బాక్సాఫీస్ బద్దలైపోవాలి..అంటూ 'దాదా' చిత్రబృందం మరోసారి ఈ సినిమా రాకపై క్లారిటీ ఇచ్చింది. ఒక వారం ఒక సినిమా విడుదలైతే ఏ గొడవా ఉండదు. అలా కాకుండా, ఒకేవారం నాలుగైదు సినిమాలు విడుదల అంటేనే.. చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, థియోటర్స్ సమస్య. పోటీ ఎక్కువగా ఉంటే కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది. ఆడియన్స్‌లో కూడా కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది.
దీనివల్ల, హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తిరగబడతాయి. కొన్ని సినిమాలు సరైన సీజన్‌లో సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్ల ప్రేక్షకులను చేరుకోలేకపోతున్నాయి. దీనికి, ఉదాహరణ తాజాగా వచ్చిన 'భోగి' సినిమా. టైటిల్‌కి, కథకి, విడుదల సమయానికి ఏమాత్రం సంబంధం లేకపోవడం వల్ల భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా మిగిలింది.
అయితే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ 'దాదా' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. కానీ, అదేరోజు నాగార్జున నటిస్తున్న 'కింగ్ 100' కూడా పోటీకి వస్తోంది. ఇది సమస్య కాదు గానీ, బాలయ్యకి గాయం కావడం వల్ల షూటింగ్ ఆలస్యం అయి..ఇప్పుడు జెట్ స్పీడ్‌లో అన్నీ పనులను పూర్తి చేస్తున్నారు. అయితే, ప్రమోషన్స్‌కి సమయం సరిపోదనే కారణంతో..సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేసేందుకు కేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం అవుతోంది.
పదే పదే ఈ వార్తలు వస్తుండటంతో మరోసారి 'దాదా' చిత్రబృందం కన్‌ఫర్మేషన్ ఇవ్వక తప్పలేదు. తాజాగా, ఈ సినిమాను ముందునుంచి చెప్తున్నట్టుగానే డిసెంబర్ 24నే రిలీజ్ చేస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ "షెహరంతా అదిరిపోవాలి….బాక్సాఫీస్ బద్దలైపోవాలి"…అంటూ బాలయ్య మార్క్ మాస్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్‌ను జత చేశారు. దీంతో, మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెట్టినట్టైంది.
