Tollywood: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అంద్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఒక సినిమా గురించి చెప్పాడంటే ఖచ్చితంగా ఆ సినిమా భారీ కమర్షియల్ హిట్ సాధిస్తుందని దాదాపుగా ఫిక్సైపోవచ్చు. ఇప్పుడు, ఆయన అలియాస్ రుక్మిణి సినిమాపై కూడా చేసిన కామెంట్స్, చెప్పిన సీక్రెట్స్ అలాగే, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. నితిన్ ఖాతాలో ఈ సినిమా హిట్‌గా చేరబోతుందని దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
నాని సమర్పణలో "అలియాస్ రుక్మిణి":
నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంట నిర్మాతగా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన అలియాస్ రుక్మిణి సినిమా గురించి నితిన్-నానిల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని చెప్పిన దిల్ రాజు డిసెంబర్ 3న ప్రీమియర్స్..పడనున్నాయని..డిసెంబర్ 4న నితిన్ ఖాతాలో భారీ హిట్ పడబోతుందని చెప్పాడు. అంతేకాదు, గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుందామని అన్నాడు. ఈ సినిమా ప్రమో, పాటలు చూసినప్పుడే సక్సెస్ వైబ్రేషన్స్ కనిపించాయని దిల్ రాజు అన్నారు. ట్రైలర్ రిలీజ్ కాక ముందే..డబ్బింగ్ పూరైయ్యాక నితిన్ కాల్ చేసి అంకుల్ సినిమా చూశాను..సూపర్ హిట్ అని చెప్పినట్టుగా తెలిపాడు.
ట్రైలర్ చూశాక నితిన్, నానిలకి నేను కూడా మెసేజ్ పెట్టానని చెప్పాడు దిల్ రాజు. నితిన్ 25 ఏళ్ళ కెరీర్లో హిట్ ఫ్లాప్స్ అన్నీ చూశాడు. ఒక ఫ్లాప్ తర్వాత వచ్చే హిట్ మంచి కిక్ ఇస్తుందని దిల్ రాజు అన్నాడు. నాని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తున్నాడని ఒకవైపు హీరోగా చేస్తూ..ఇంకోవైపు నిర్మాతగా వ్యవహరించడం అంత ఈజీ కాదని తెలిపాడు. మొత్తానికి, అలియాస్ రుక్మిణి సినిమా భారీ హిట్ అని దిల్ రాజు చాలా నమ్మకంగా చెప్పడంతో మంచి అంచనాలు పెరిగాయి.
