ఆరోగ్యం

Knee Pain: మోకాళ్లు, కీళ్ల నొప్పులతో నరకం చూస్తున్నారా? ఆముదం, శొంఠితో ఇలా చెక్ పెట్టండి!

Knee Pain: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య మోకాళ్లు, కీళ్ల నొప్పులు. ఉదయం నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, వాపు రావడం, నాలుగు అడుగులు వేయాలన్నా నరకం కనిపించడం సర్వసాధారణమైపోయింది. వైద్య భాషలో దీన్నే ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అంటారు. అయితే, ఈ మొండి నొప్పులకు ఆయుర్వేదంలో మనకు అందుబాటులో ఉండే ఆముదం, శొంఠితో చక్కటి పరిష్కారం ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయంటే..

ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ‘వాత దోషం’ అదుపు తప్పినప్పుడు ఇలాంటి కీళ్లు, కండరాల నొప్పులు మొదలవుతాయి. ఆర్థరైటిస్‌లో ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ వంటి రకాలు ఉంటాయి. వీటి తీవ్రతను బట్టి కీళ్లలో నిరంతర నొప్పి, వాపు, కదలికల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరిలో ఎముకల సాంద్రత తగ్గడంతో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం లోపాలు కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

ఆముదం, శొంఠితో వాత దోషానికి చెక్!

కీళ్లవాతం, వాత సంబంధిత నొప్పులను అదుపులోకి తీసుకురావడంలో ఆముదం నూనె, ఎండిన అల్లం (శొంఠి) అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు వివరించారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో పాటు దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఔషధ నూనెలతో మర్దన చేసే ‘అభ్యంగం’, ‘మాత్రాబస్తి’ వంటి ప్రత్యేక చికిత్సా విధానాలు, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచించారు.

వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఆముదం, శొంఠి మంచివే కదా అని సొంతంగా వైద్యం చేసుకోవడం ఏమాత్రం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, వీటి మోతాదు, వాడే విధానం వ్యక్తిని బట్టి మారుతుంది. అందుకే అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి, సరైన నిర్ధారణ తర్వాతే వీటిని ఉపయోగించాలి. అలాగే కీళ్ల నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు, యూరిక్ యాసిడ్, ESR, CRP వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నప్పటికీ, అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, చికిత్సలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదని డాక్టర్లు స్పష్టం చేశారు.

తర్వాత చదవండి