సినిమా

Dulquer Salmaan: రెండు ఫ్లాపులొచ్చిన దుల్కర్‌కి "ఆకాశంలో ఒక తార" హిట్ ఇవ్వాల్సిందే

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌కి గత కొంతకాలంగా తెలుగులో అభిమానులు బాగా పెరిగారు. ఇక్కడ స్ట్రైట్ సినిమాలతో అలరిస్తుండటం వల్ల మార్కెట్ కూడా బాగా పెంచుకున్నాడు. మహానటి సినిమా దుల్కర్ సల్మాన్‌ని మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర చేసింది. ఈ నెల 20వ తేదీన 'ఆకాశంలో ఒక తార' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ చాలా కీలకంగా మారింది దుల్కర్‌కి.

ఎందుకంటే, దీనికంటే ముందు వచ్చిన 'కాంత' భారీ అంచనాల మధ్య వచ్చింది. రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో కనిపించారు. బయోపిక్ మూవీగా వచ్చింది 'కాంత'. మహానటి సినిమా రిలీజ్‌కి ఎలాంటి ఫీల్ క్రియేట్ అయిందో అలాంటి ఫీల్ 'కాంత' రిలీజ్ సమయంలోనూ ఏర్పడింది. కానీ, అనూహ్యంగా ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఆ తర్వాత వచ్చిన ‘ఐయామ్ గేమ్’ కూడా ఫ్లాప్‌గా మిగిలింది.

దీంతో, రెండు వరుస ఫ్లాపులు పడ్డాయి. అయినా, గీతా ఆర్ట్స్-వైజయంతీ మూవీస్ లాంటి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన 'ఆకాశంలో ఒక తార' సినిమాలో హీరోగా దుల్కర్‌కి ఛాన్స్ రావడం ఆసక్తికరమైన విషయం. కంటెంట్ పరంగా ఇప్పటి వరకూ ఈ మూవీపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇటీవల నిర్వహించిన ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచాడు.

వ్యోమగామి కావాలని కలలుకనే ఓ అమ్మాయికి, సమాజం అలాగే కుటుంబ సభ్యుల నుండి ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని అండగా నిలిచే యువకుడి పాత్రలో దుల్కర్ నటించాడు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. వరుసగా రెండు ఫ్లాపులొచ్చిన దుల్కర్‌కి 'ఆకాశంలో ఒక తార' హిట్ అనేది తప్పనిసరిగా మారింది. ఇదే, రోజు తన తండ్రి మమ్ముట్టి-ధనుష్ నటించిన 'ఓం' సినిమా, కీర్తి సురేష్ నటించిన 'సత్యవాన్ సావిత్రి' రిలీజ్ కానున్నాయి. చూడాలి, మరి ఇంత పోటీని తట్టుకొని దుల్కర్ హిట్ కొట్టగలడా లేదా.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి