జాతీయం

విమానాశ్రయాన్ని కుదిపేసిన భూకంపం.. ల్యాండింగ్ కాకుండానే విమానాలు వెనక్కి!

దక్షిణ కాలిఫోర్నియా తీరానికి సమీపంలో 5.0 తీవ్రతతో సంభవించిన భూకంపం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) వద్ద ఉత్కంఠకు దారితీసింది. విమానాశ్రయంలో ప్రకంపనలు చోటుచేసుకుంటుండగా, రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ల్యాండింగ్ నిలిపివేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించారు.

 దక్షిణ కాలిఫోర్నియా తీరానికి సమీపంలో 5.0 తీవ్రతతో సంభవించిన భూకంపం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) వద్ద ఉత్కంఠకు దారితీసింది. విమానాశ్రయంలో ప్రకంపనలు చోటుచేసుకుంటుండగా, రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ల్యాండింగ్ నిలిపివేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించారు. ఆకస్మిక భూకంప పరిస్థితుల మధ్య ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్త చర్య తీసుకున్నారు.

 ప్రకంపనల తీవ్రతను గమనించిన కంట్రోలర్ డెల్టా ఫ్లైట్ 1972ను పదేపదే 'గో అరౌండ్' చేస్తూ మరోసారి చుట్టూ తిరిగి రావాలని ఆదేశించిన ఉద్రిక్తత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియోలో నమోదైంది. విమానాశ్రయంలోని పలు భాగాలు కంపిస్తుండగా, పైలట్ వెంటనే స్పందించి కంట్రోలర్ సూచన మేరకు ల్యాండింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని మాన్హట్టన్ బీచ్ తీరానికి సుమారు ఆరు మైళ్ల దూరంలో తొలి భూకంపం నమోదైంది.

 ఈ ప్రకంపనల ధాటికి లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక టెర్మినల్ వద్ద గాజు కిటికీలు పగిలిపోయినట్లు సమాచారం.అయితే ఈ భూకంపం వల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తర్వాత చదవండి