సినిమా

ENE-Repeat: సినిమాకి ప్లస్ అయింది ఈ ముగ్గురే..

ENE-Repeat: ఒక సినిమా సక్సెస్‌కి దర్శకుడు, హీరో, నిర్మాత ప్రధాన కారణంగా నిలుస్తారు. అయితే, కొన్ని సినిమాలకి టాప్ కమెడియన్ ప్లస్ కావచ్చు. కొన్ని సినిమాలకి కేవలం హీరోయిన్ మాత్రమే కలిసి రావచ్చు. ఇంకొన్ని సినిమాలకి మ్యూజిక్ బిగ్ ప్లస్ పాయింట్‌గా నిలవొచ్చు. ఇప్పుడు, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సినిమాలలో "ఈ నగరానికి ఏమైంది సీక్వెల్" మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి, కారణం తరుణ్ భాస్కర్-హీరో విశ్వక్ సేన్-అభినవ్ గోమఠం.

తరుణ్ భాస్కర్-హీరో విశ్వక్ సేన్-అభినవ్ గోమఠం..ఈ ముగ్గురు వల్లే "ఈ నగరానికి ఏమైంది సీక్వెల్" బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుందని ప్రేక్షకులు, సినీ వర్గాలు అంటున్నాయి. పాన్ ఇండియా సినిమా అంటూ హెవీ యాక్షన్ సినిమాలొచ్చి ప్రేక్షకుల సహనాన్ని థియేటర్స్‌లో పరీక్షిస్తున్నాయి. దాదాపు, 3 గంటల సినిమాలో ఏముందో కూడా అర్థం కానివి ఈ మధ్య చాలా వచ్చాయి.

బిగ్ స్టార్స్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్కేల్ సినిమా అనేవి కాకుండా చిన్న సినిమా..చిన్న బడ్జెట్..టాలెంటెడ్ యూత్ చేస్తున్న "ఈ నగరానికి ఏమైంది సీక్వెల్" లాంటి సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకొని కనీసం 5 నుంచి 6 వారాలు సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. వర్క్ టెన్షన్, వ్యక్తిగత కారణాలు..ఇవి కాకుండా సరదాగా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఇలాంటి పక్కా ఎంటర్‌టైనర్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి.

2018లో వచ్చిన "ఈ నగరానికి ఏమైంది" అప్పట్లో సాలీడ్ హిట్‌గా నిలిచింది. అసలు, ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఇలా కూడా తీయొచ్చా..అని ఆలోచింప చేసింది దర్శకుడు తరుణ్ భాస్కర్. మళ్ళీ ఇన్నేళ్ళకి సీక్వెల్‌తో వచ్చి అదే కంటిన్యూ చేశాడు. ముగ్గురు జెంజీలు కలిస్తే ఇలాంటి సాలీడ్ హిట్ పడుతుందని తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ అభినవ్ మళ్ళీ నిరూపించారు.

తర్వాత చదవండి