సినిమా

Vrushakarma: హృదయాన్ని హత్తుకునే "ఛలో పదవే" సాంగ్ వచ్చేసింది..

Vrushakarma: అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్ 4న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది. కంప్లీట్ మెలోడీగా సాగిన ఛలో పదవే కొద్దిసేపటి క్రితం విడుదలై మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక, ఇప్పటికే ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ సాంగ్ వచ్చి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన రెండో పాట ‘ఛలో పదవే’ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు మొదటి పాటకు పూర్తి భిన్నంగా రెండవ పాటను ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ మెలోడీగా రూపొందించాడు.

ఈ పాటకి సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన మ్యూజిక్‌ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి, సాయి విఘ్నేష్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ముఖ్యంగా, పాటలోని భావోద్వేగాలు, సంగీతం..అలాగే విజువల్స్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చిత్రీకరించారు. ఒకరకంగా, చెప్పాలంటే చైతూ ఇలాంటి ఎమోషనల్ సాంగ్ చేయడం ఇదే మొదటిసారి.

ఈ పాటలో నాగచైతన్యతో పాటుగా చిన్నారి కియారా ఖన్నా మధ్య వచ్చే సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సినిమాలో కియారా పోషిస్తున్న పాత్రకు సంబంధించినటువంటి భావోద్వేగాలను చాలా అందంగా చూపించినట్లు అర్థమవుతోంది. చైతన్య కూడా ఎంతో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. ముఖ్య పాత్రలో స్పర్శ్ శ్రీవాస్తవ కనిపించనున్నారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి