టాప్ న్యూస్

Today In History (25-11-2026) : ఏపీలో తుఫాన్ భీభత్సం.. లక్షలాది మందిని ముంచెసిన రాకాసి అలలు!

ఏపీలోని కాకినాడ సమీపంలో గల చారిత్రక ఓడరేవు నగరం ‘కోరింగ’ను 1839 నవంబర్ 25న అత్యంత భీకర తుఫాను తాకింది. దాంతో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. సుమారు 40 అడుగుల ఎత్తైన రాక్షస అలలు తీరాన్ని దాటాయి. ఈ జలప్రళయంలో కోరింగ పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

ఏపీలోని కాకినాడ సమీపంలో గల చారిత్రక ఓడరేవు నగరం ‘కోరింగ’ను 1839 నవంబర్ 25న అత్యంత భీకర తుఫాను తాకింది. దాంతో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. సుమారు 40 అడుగుల ఎత్తైన రాక్షస అలలు తీరాన్ని దాటాయి. ఈ జలప్రళయంలో కోరింగ పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రేవులో లంగరు వేసి ఉన్న సుమారు 20,000 నౌకలు, పడవలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన కోరింగ ఓడరేవు ఈ తుఫాను తర్వాత కోలుకోలేకపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన తుఫాన్లలో ఒకటిగా నిలిచింది.

30 ఏళ్ల కిందట 1996 నవంబర్ 25 జరిగిన ఘటనలు..

BSE ఆన్‌లైన్ ట్రేడింగ్ : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థ BOLTను ప్రారంభించి భారత షేర్ మార్కెట్‌లో ఆధునిక యుగానికి నాంది పలికిన రోజు.

మదర్ థెరిసా అనారోగ్యం : తీవ్రమైన ఛాతీ నొప్పి, గుండె సంబంధిత సమస్యలతో మదర్ థెరిసా కోల్‌కతా ఆసుపత్రిలో చేరారు.

సెర్బియా నిరసనలు : స్థానిక ఎన్నికల రద్దుకు నిరసనగా బెల్‌గ్రేడ్‌లో లక్ష మందికి పైగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన చేపట్టారు.

అమెరికా మంచు తుఫాను : మధ్య అమెరికాను తీవ్రమైన మంచు తుఫాను తాకడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత చరిత్ర & యుద్ధాలు:

గోవా ఆక్రమణ (1510) : పోర్చుగీస్ సేనాని ‘అఫోన్సో డి అల్బుకెర్కీ బీజాపూర్ సుల్తానేట్‌ను ఓడించి గోవాను ఆక్రమించుకున్న రోజు.

కోరింగ తుఫాను (1839): ఆంధ్రప్రదేశ్‌లోని కోరింగ (కాకినాడ సమీపం) తీరాన్ని భీకర తుఫాను తాకి 40 అడుగుల అలలతో నగరాన్ని తుడిచిపెట్టింది. లక్షలాది మంది మరణించారు.

అలహాబాద్ హైకోర్టు (1866): భారతదేశంలోని అత్యంత పురాతన న్యాయస్థానాల్లో ఒకటైన అలహాబాద్ హైకోర్టు ప్రారంభం.

అంబేద్కర్ చారిత్రక ప్రసంగం (1949) : భారత రాజ్యాంగ ఆమోదానికి ఒక రోజు ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ సభలో తన ముగింపు ప్రసంగం చేశారు.

శాస్త్రి రాజీనామా (1956): అరియలూర్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు.

భారతీయ ప్రముఖుల జననాలు:

కృష్ణాజీ ప్రభాకర్ ఖాదిల్కర్ (1872): ప్రముఖ మరాఠీ నాటక రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.

సాధు టి.ఎల్. వాస్వాని (1879): ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'మీరా ఉద్యమం' వ్యవస్థాపకుడు.

రూపా గంగూలీ (1966): ప్రముఖ సినీ నటి (మహాభారత్ ద్రౌపది పాత్రధారి), మాజీ ఎంపీ.

ముప్పలనేని శివ (1968): ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు.

దిలీప్ టిర్కీ (1977): భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్.

ఝులన్ గోస్వామి (1982): భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్.

భారతీయ ప్రముఖుల మరణాలు:

ద్వారం వెంకటస్వామి నాయుడు (1964): ప్రపంచ ప్రఖ్యాత కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసుడు.

యశ్వంత్ రావ్ చవాన్ (1984): మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత మాజీ ఉప ప్రధానమంత్రి

ఆర్.వి.ఎస్. పేరిశాస్త్రి (1990): భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC).

సితార దేవి (2014): ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి.

సి.కె. జాఫర్ షరీఫ్ (2018): కేంద్ర మాజీ రైల్వే మంత్రి.

వ్యాధులు & ఆరోగ్య చరిత్ర:

క్షయవ్యాధితో రాజు మరణం (1885): స్పెయిన్ రాజు అల్ఫోన్సో XII తన 27వ ఏటనే క్షయవ్యాధి (TB)తో మరణించారు.

తర్వాత చదవండి