సినిమా

Keerthy Suresh: నా ముఖంలో మీకు ఎక్కడ అసౌకర్యం కనిపించింది?

Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘డోరతీ’. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు దర్శకుడు మిస్కిన్ కూడా కీలక పాత్రలో నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా..కీర్తి నటనకు మాత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక, ఇదే సినిమాలో కీర్తి నటనను దర్శకుడు మిస్కిన్ ప్రశంసింశాడు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.

సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో వేదిక మీద కీర్తి సురేష్‌ పక్కనే కూర్చున్న మిస్కిన్ ఆమెను అభినందిస్తూ తొడపై చేయి వేశాడు. దీనికి, సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మిస్కిన్ తీరును కీర్తి సురేష్ అసౌకర్యంగా ఫీల్ అయ్యిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో వేదికల మీద ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలంటూ ఇంకొందరు ఘాటుగా మిస్కిన్‌ను విమర్శించారు.

దీంతో, ఈ విమర్శలపై కీర్తి సురేష్ ఘాటుగా స్పందించింది. అంతేకాదు, నెగిటివ్‌గా పోస్ట్ చేసిన సంబంధిత నెటిజన్ తాను ఎత్తి చూపిన పోస్ట్‌ను తొలగించాల్సి వచ్చింది. ఇక, కీర్తి.. “ముందుగా నా ముఖంలో మీకు ఎక్కడ అసౌకర్యం కనిపించింది? మా మధ్య తండ్రీకూతుళ్ల మాదిరిగా అనుబంధం ఉందని మేము చెప్పిన మాట మీరు వినలేదా? ఒకవేళ నాకు అసౌకర్యంగా ఉన్నా సరే, సినిమాల్లో తాకుతారు కాబట్టి బయట కూడా అలాగే ఉండాలా? ముందు నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో బ్రదర్”.. అంటూ రివర్స్‌లో కౌంటర్ ఇచ్చింది.

అలాగే, మా మధ్య తండ్రీకూతుళ్ల ఉంది బంధమని కీర్తి మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి, కీర్తి మీద అభిమానంతో ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కూడా తప్పుగా ఉందని ఆమె కౌంటర్ ఇవ్వడం కొందరికి సబబుగా అనిపిస్తుంటే..ఇంకొందరికి మాత్రం నచ్చడం లేదు. కాగా, కీర్తి సురేష్ ఫ్లాప్స్ వస్తున్నా కూడా వరుసగా అన్నీ సౌత్ భాషల్లో అవకాశాలు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన జనవరి 12 విడుదల సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది.

తర్వాత చదవండి