జాతీయం

VS Babu: స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

తమిళనాడు రాజకీయాల్లో విషాదం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ను (Stalin) ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (Tvk Mla Vs Babu) కన్నుమూశారు. వీఎస్ బాబు వయసు 75 సంవత్సరాలు. కొళత్తూరు (Kolathur) నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యేగా గెలుపొందారు.

VS Babu: తమిళనాడు రాజకీయాల్లో విషాదం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. వీఎస్ బాబు వయసు 75 సంవత్సరాలు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యేగా గెలుపొందారు.

స్టాలిన్’పై అనూహ్య విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు

గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. వీఎస్ బాబు కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో చనిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ పై అనూహ్య విజయం సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు వీఎస్ బాబు.

70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స

సెప్టెంబర్ 9న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వీఎస్ బాబు చేరారు. 70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వీఎస్ బాబు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

స్టాలిన్ కంచుకోట బద్దలు

కొళత్తూరు నియోజకవర్గం 2011 నుంచి డీఎంకే చీఫ్ స్టాలిన్ కంచుకోటగా ఉంది. అలాంటి నియోజకవర్గంలో నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అభ్యర్థిగా బాబు పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బాబుకు 82వేల 997 ఓట్లు వచ్చాయి. స్టాలిన్‌కు 74వేల 202 ఓట్లు వచ్చాయి. 8వేల 795 ఓట్ల మెజారిటీతో స్టాలిన్‌పై ఘన విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు వీఎస్ బాబు. ఆయన ఆకస్మిక మరణంతో కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది.

వీఎస్ బాబు అకాల మరణం పట్ల తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాబు మృతి పార్టీకి తీరని లోటన్నారు.

తర్వాత చదవండి