King 100: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున నటిస్తున్న మైల్ స్టోన్ మూవీ కింగ్ 100 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. టబు హీరోయిన్గా నటిస్తోంది. అయితే, తాజాగా..ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. చాలా ముందుగా కింగ్ 100 సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించడం ఇప్పుడు మేకర్స్‌కి బాగా ఒత్తిడి అనిపిస్తోందట.
గతంలో చాలాసార్లు స్వయంగా నాగార్జున ఒక మాట అన్నాడు. సినిమా ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తున్నారు. లెదంటే సీజన్స్‌లో ఇంకో సినిమా పోటీకి రాకుండా ముందుగానే డేట్ లాక్ చేసిన సందర్భాలున్నాయి. వీటిపై నాగ్ అప్పట్లో సీరియస్ అయ్యాడు కూడా. ఒక సినిమా షూటింగ్, సహా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకుండా ఎలా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అని.
అదే, సంసృతి మన పూరి జగన్నాధ్ చాలా సినిమాలకి పాటించాడు. కానీ, ఆయన చెప్పిన తేదీకి ఎట్టి పరిస్థితుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. అలా, ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఎందుకనో చెప్పిన తేదీకి సినిమాను రిలీజ్ చేయడం చాలా సమస్యగా ఉంది. కింగ్ 100 కి ఇప్పుడు అదే సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది.
చాలా నెలల క్రితమే నాగార్జున వందవ సినిమా మొదలైంది. కానీ, ఆయన చేస్తున్న బిగ్ బాస్ షో తో పాటు ఇతర కారణాల వల్ల, ఈ సినిమా షూటింగ్‌తో సహా ఇతర పనులు పూర్తి కాలేదట. అందుకే, కింగ్ 100 అధికారికంగా ప్రకటించిన డిసెంబర్ 24వ తేదీకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే జనవరి మూడవ వారమే కొత్త డేట్ దొరుకుంది. మరి, నాగ్ ప్లాన్స్ ఏంటో చూడాలి.
