సినిమా

Motorcycle Diaries: ఊహించని కాంబోలో క్రేజీ మూవీ!

Motorcycle Diaries: ఊహించని కాంబోలో క్రేజీ మూవీ తెరకెక్కనుంది. ఇప్పుడు ఇది ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా, ఇది ఊహించని కాంబినేషన్. కన్నడ క్రేజీ స్టార్ హీరో రిషబ్ శెట్టి, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సితార సంస్థ అధినేత నాగవంశీ కలిసి ఒక సినిమాకి శ్రీకారం చుట్టడం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదొక టైమ్ ట్రావెల్ కథగా రానుంది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. వరుసగా టాలెంట్ ఉన్న దర్శకులకి, ఫాంలో ఉన్న హీరోలకి అడ్వాన్స్ ఇస్తూ డేట్స్ లాక్ చేస్తోంది. అలా, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుంటోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు, ఈ సంస్థ కన్నడ హీరో రిషబ్ శెట్టికి చెందిన రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంస్థతో చేతులు కలిపింది.

ఈ రెండు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల కలయికలో ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా, మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. కాంతార సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్..ప్రస్తుతం జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా నటిస్తున్న రిషబ్..ఇప్పుడు నిర్మాతగా తెలుగు సినిమాలో భాగమవడం ఆసక్తికరంగా ఉంది.

కాగా, ఈ సినిమాకి శివా చిరంతన దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి కలిసి నిర్మిస్తున్నారు. ఇక, ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉండి దర్శకుడు చెప్పిన కథకు ప్రాణం పోసేలా సంగీతం అందిస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా ఎంపికైయ్యాడు. భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్ ను, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్షన్ కి సంబందించిన బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. ఇక, పూర్తి వివరాలను కూడా మేకర్స్ త్వరలో తెలపనున్నారు.

తర్వాత చదవండి