Geetha Arts: "ఆకాశమంత విజయం..ఆకాశమంత అభినందన".. అంటూ తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి కథతో సినిమా తీస్తే ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఏ స్థాయిలో ప్రశంసలు అందుతాయో ఇటీవల వచ్చిన ఆకాశంలో ఒక తార సినిమా మళ్ళీ నిరూపించింది. ఈ సినిమాకి బృందాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power tar Ram Charan) అభినందించడం ఆసక్తికరంగా మారింది.
నటుడికి భాషా పరమైన బేధం లేదని గత కొంతకాలంగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిరూపిస్తూ వస్తున్నాడు. తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు నిరూపించాయి. ఇక, ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ఘన విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా 'ఆకాశంలో ఒక తార' చిత్ర బృందాన్ని ఇంటినికి పిలిపించుకొని మరీ అభినందించారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఒక సినిమా హిట్ సాధించింది అంటే మెగాస్టార్ ఆ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అంతేకాదు, యువ దర్శకులలో టాలెంట్ ఉందనిపిస్తే ఆయన కోసం కథ రెడీ చేయమని కూడా ఆఫర్ ఇస్తున్నారు.
ఇక, తాజాగా మెగా హీరోలు 'ఆకాశంలో ఒక తార' చిత్ర బృందాన్ని అభినందించడంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ "ఆకాశమంత విజయం..ఆకాశమంత అభినందన" అంటూ ట్వీట్ చేసింది. దీనికి, సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిరంజీవి, చరణ్, దుల్కర్ సల్మాన్, స్వప్న దత్, ప్రియాంక దత్, హీరోయిన్ సాత్విక వీరవల్లి, దర్శకుడు పవన్ సాధినేని ఉన్నారు. మొత్తానికి, 'ఆకాశంలో ఒక తార' లాంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.
