Tollywood: నిన్నా మొన్నటి వరకు వృషకర్మ సినిమా బృందం నుంచి ఆఇంచిన స్థాయిలో అప్డేట్స్ రావడం లేదని అక్కినేని అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుసగా అప్డేట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి సాలీడ్ కంటెంట్ రావాలని ఎదురుచూస్తున్నారు. ఆ రకంగానే తాజాగా వృషకర్మ సినిమాకి సంబందించి సాలీడ్ అప్డేట్స్ వచ్చాయి. డిసెంబర్2న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ డిసెంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్న తెలుగు చిత్రాల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన వృష కర్మ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించిన సంగతి తెలిసిందే. ఇక, టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ఈ క్రేజీ థ్రిల్లర్ మూవీ మైథలాజికల్ థ్రిల్లర్గా రానుంది. అయితే, ఈ చిత్రంతో ప్రేక్షకులకి ఆల్రెడీ మంచి థ్రిల్స్ అందించడం పక్కా అంటూ మేకర్స్ ఇటీవల వచ్చిన ట్రైలర్ తోనే ప్రామిస్ చేశారు.
ఇక, తాజాగా వృష కర్మ నుంచి మరో అప్డేట్ ఇస్తూ పలు ప్రీమియం ఫార్మాట్ లలో కూడా సినిమాను తీసుకురానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. 4డిఎక్స్, డాల్బీ సినిమా, ఎపిక్, హెచ్ డి ఆర్ బార్కో వంటి ఫార్మాట్ లలో వృషకర్మ మూవీని చూసే ఆడియెన్స్ కి రెట్టింపు స్థాయిలో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. అలాగే, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్స్ కూడా రివీల్ చేశారు.
డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్ గా వృషకర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు ప్రకటించారు. దీంతోం అక్కినేని అభిమానులకి డిసెంబర్ మొదటి వారంలోనే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని భావించవచ్చు. ఇక, ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా, బి వి ఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మించారు.
