సినిమా

Nani-Nithin: "అలియాస్ రుక్మిణి" హిట్ ఇద్దరికీ చాలా అవసరం..

4 నిమిషాల పఠనం

Nani-Nithin: టాలీవుడ్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా అలియాస్ రుక్మిణి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను దండోరా మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ కాంత్ దేవసోత్ రూపొందిస్తున్నాడు. అయితే, ఈ సినిమా సక్సెస్ నిర్మాతగా నానికి, హీరోగా నితిన్‌కి చాలా కీలకంగా మారింది.

కోర్ట్ సినిమాతో మంచి లాభాలను అందుకున్న నాని, ఆ తర్వాత ఆయనే హీరోగా హిట్ ఫ్రాంఛైజీస్‌లో భాగంగా హిట్ 3లో నటించాడు. ఇది, ఆయన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. టాక్ హిట్ అని వచ్చినప్పటికీ..నానికి ఆశించిన లాభాలను తేలేకపోయింది. ఇక, ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా కనీసం యావరేట్ అనే టాక్‌ను కూడా తెచ్చుకోలేకపోయింది. నిర్మాతకి, బాగానే నష్టాలను తెచ్చింది.

ఇలాంటి, నేపథ్యంలో నాని పెద్ద రిస్క్ చేస్తూ నితిన్ కోసం సినిమా చేస్తుండటం విశేషం. భీష్మ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మళ్ళీ నానికి చెప్పుకునే భారీ హిట్ దక్కలేదు. దీంతో, ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు అలియాస్ రుక్మిణి సినిమా సక్సెస్ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం, బిజినెస్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే, థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల వరకూ జరిగినట్టుగా సమాచారం. దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిఫండబుల్ పద్ధతిలో దక్కించుకున్నారట.

ఇక, ఈ సినిమాలో ఆఫియా సైయద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకిదే, తొలి తెలుగు సినిమా. ఇక్కడ, ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. అలియాస్ రుక్మిణి సినిమా రిలీజ్ రోజే అక్కినేని నాగ చైతన్య-మీనాక్షి చౌదరి జంటగా నటించిన వృష కర్మ రిలీజ్ కాబోతోంది. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకి దర్శకుడు. మరి, వృష కర్మ పోటీని తట్టుకొని నాని-నితిన్‌ల అలియాస్ రుక్మిణి ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

#Nani#Nithin#Alias Rukmini#Tollywood#Aafiya Sayed
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి