సినిమా

Nivetha Thomas: శ్రీమతి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..

Nivetha Thomas: వకీల్ సాబ్, శాకిని-డాకిని, 35 చిన్న కథ కాదు లాంటి సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్(Nivetha Thomas) ఇప్పుడు శ్రీమతి(Srimathi) చిత్రంతో దిగ్గజ ఓటీటీ జీ5(Zee5)లో మన ముందుకు రాబోతోంది. డిసెంబర్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్‌గా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి చిత్ర బృందం అందరూ హాజరయ్యారు.

నివేదా థామస్:

తాజాగా జరిగిన ‘శ్రీమతి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య పోటీ పెట్టేటువంటి కథ కాదని ముందుగా క్లారిటీ ఇచ్చారు. ఒకరికొకరు అర్థం చేసుకోవడం, జీవితంలో పరస్పరం తోడుగా నిలవడం అనే బలమైన అంశంతో ఈ సినిమా రూపొందిన చిత్రం అని తెలిపారు. అంతేకాదు, ఈ సినిమా పురుషులకి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇందులో, మహిళల సమస్యల గురించి మాత్రమే కాకుండా, కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన ఉండాలి అన్నవిషయాలను చూపించినట్టు వెల్లడించింది.

పెళ్లి తర్వాత కూడా సొంత గుర్తింపు ఉండాలి: రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఈ ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన మాటలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఆడవాళ్ళకు పెళ్లి తర్వాత కూడా వారికంటూ ఓ గుర్తింపు ఉండాలని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహిళల వ్యక్తిత్వాన్ని, వారి ఆశయాలను కుటుంబం గౌరవించాలన్నారు. ఒక మహిళ తన కలలను కొనసాగించేందుకు కుటుంబ సభ్యులు అందరూ ఆమెకి అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు, ప్రతి భాషలోనూ చెప్పాల్సిన కథ ‘శ్రీమతి’ అని రేణు దేశాయ్ చెప్పారు.

డిసెంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కి రెడీ:

దర్శకుడు విశ్వక్ ఖండేరావు రూపొందించిన ఈ సినిమాలో నివేదా థామస్, తిరువీర్ జంటగా నటించారు. రేణు దేశాయ్, హరితేజ, గోపరాజు రమణ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది. ఇక, ఈ సినిమాలో నివేదా థామస్ మధ్యతరగతి గృహిణి పాత్రలో నటించింది. ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో బాగా ఆకట్టుకుంది. మరి, మొదటిసారి ఓటీటీలో వస్తోన్న ఆమె సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటో చూడాలి.

తర్వాత చదవండి