సినిమా

OTT Movies: నేటి (26.11.2026) నుంచి ఓటిటిలోకి వచ్చేసిన ‘గరివిడి లక్ష్మి’..

OTT Movies: నేటి నుంచి ఓటిటిలోకి వచ్చేసింది ‘గరివిడి లక్ష్మి. థియోటర్స్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులకి స్మాల్ స్క్రీన్ మీద కంటే ముందు డిజిటల్ మీడియాలో నచ్చిన సినిమాను చూసుకునే వీలుంటుంది. దిగ్గజ ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులకి చాలా వరకూ ఎంటర్‌టైన్మెంట్ అందుబాటులో ఉంటోంది. వెబ్ సిరీస్, సినిమాలు చూసేందుకు అవకాశం కలుగుతోంది.

అందుకే, ఎంత భారీ హిట్ సినిమా అయినా రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా, వెంకటేష్-శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఆదర్శకుటుంబం సినిమా ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ శుక్రవారం నుంచి ఈ చిత్రం డిజిటల్ మీడియాలో వీక్షించేందుకు అందుబాటులోకి రానుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఆదర్శకుటుంబం థియోటర్స్‌లో అంతగా మెప్పించలేదు. మరి, ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే, ఇదే క్రమంలో యువ నటీనటులు ఆనంది-రాగ్ మయూర్ జంటగా నటించిన ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీలోకి వచ్చేసింది. దర్శకుడు జమ్మి నాయుడు గౌరీ రూపొందించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలోని ప్రముఖ బుర్రకథ గాయకురాలు గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఎట్టకేలకి ఓటిటి ప్రేక్షకులని అలరించేందుకు వచ్చేసింది.

కాగా, ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు పాపులర్ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమా ఈ నెల 26 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి, ఈ సినిమాని థియోటర్స్‌లో మిస్ అయ్యినవారు ఈ ఓటీటీ చూడొచ్చు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందించగా, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అలాగే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

తర్వాత చదవండి