Pavan Sadineni: మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది ‘ఆకాశంలో ఒక తార’ సినిమా. దీనికంటే దర్శకుడు పవన్ సాదినేని పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగ వైరల్ అవుతోంది. ఒక సినిమా అనుకున్నప్పటి నుంచి ఆ సినిమా విడుదలకు ముందు వరకూ చిత్ర దర్శకులకు ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలు ఉంటాయి. తాను రాసుకున్న కథను నమ్మి, ఎన్నో కష్టాలు పడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత సహయంతో సినిమాను విడుదల చేసే క్షణం వరకూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
ఇప్పుడు దర్శకుడు పవన్ సాదినేని కూడా అటుంటి భావోద్వేగాన్నే తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకున్నాడు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రమే ‘ఆకాశంలో ఒక తార’. నవంబర్ 20 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. దర్శకుడు పవన్ సాదినేని తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, ఆయన మొదటి చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’ విడుదలైనప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న భయం నాలో ఉండేదని చెప్పాడు.

ఆ సమయంలో అల్లు అర్జున్ నుంచి వచ్చిన ప్రోత్సాహాన్ని పవన్ సాదినేని ఎప్పటికీ మర్చిపోనన్నాడు. ‘రేసుగుర్రం’ షూటింగ్ లొకేషన్‌కు పిలిపించి, క్యారవాన్‌లో కూర్చోబెట్టి సినిమా గురించి అడిగారని గుర్తు చేసుకున్నాడు. నా సినిమాలోని సీన్స్‌ను అభినందిస్తూ బన్నీ ఇచ్చిన ప్రోత్సాహం తన 13 ఏళ్ల ప్రయాణంలో ఎంతో బలాన్నిచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.
ఇక, పవన్ సాదినేని రూపొందించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తారతో తన ఎమోషనల్ జర్నీ 13 ఏళ్ళు పాటుగా సాగిందని, ప్రతి గంట.. ప్రతీరోజు ఈ సినిమా కోసమే తపించానంటూ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి.. ఈ 6 ఏళ్ళు ఒక పసి బిడ్డలా ఈ సినిమాను పెంచుతూ తీసుకొచ్చానని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి, ఆకాంలో ఒక తార సినిమా విడుదలకి ముందు దర్శకుడు పవన్ సాదినేని ఇలా ఎమోషనల్ నోట్ పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాను స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ నిర్మించారు.
