రేవంత్‌తో 2011 లోనే కంపెనీ ప్రారభం?
మీరన్నట్లు అన్న 100శాతం అమాయకుడే?
అందుకే బావ 2004లోనే మంత్రి అయ్యాడు?
మీ కుటుంబ పాలనలోనే.. మీ ఖాందాన్ దోచుకుంది?
ప్రజాపాలనలో కూడా మీరే దోపిడీ చేసుకుంటామంటే ఎలా?
మీతో, మీ పార్టీతో మీకు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం లాభమో చెప్పండి?
దోపిడీతత్వంలో దొంగలదే పెత్తనం పార్ట్ -3
శ్రీకాంతాచారి కుటుంబం కంటే మీ భర్త అనిల్ కుటుంబమే ఎక్కువ బాధితులు?
మీ ఆస్తుల విలువ, మెయింటనెన్స్ ఏంటో చూపిద్దాం
దుబాయ్ కిరాయిల లెక్కేద్దామా?
ఆనాటి రియల్ వేధింపులు తీద్దామా?
ఎంత సంపాదించారో అందరికీ చెబుదామా?
2014 నుంచి ఎలక్షన్ అఫిడవిట్స్‌తో పాటు, మీ కుటుంబ ఐటీలు తీద్దామా?
రఘుతో ఇంటర్వ్యూ చేస్తే ఉనికిలో ఉంటారని అనుకుంటున్నారా?
ఈ ఇంటర్వ్యూ పేరుతో ఎన్ని వందల కోట్ల సెటిల్మెంట్లకు ప్లాన్ చేశారు?
సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్.
వెయ్యి శాతం తైతక్కే? నిరూపించడానికి 100 ఆధారాలు ఉన్నాయి?
2011 అనుకుంట.. రేవంత్ రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత ఓ కంపెనీలో పార్టనర్‌గా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏం చేస్తే సీఎం కావాలో ఒక్కడే ప్లాన్‌గా అందరిని కలుపుకుని వెళ్లారు. ఎంతో మందిని వాడుకుని వదిలేశారు. రేవంత్‌ని చూసి కల్వకుంట్ల కవిత కూడా డబ్బులే అన్నింటికి సమాధానం, అధికారం వస్తుందని ఛాన్స్ కోసం వేచి చూస్తున్నారు. వీళ్ల దోపిడీని గ్రహించి బ్లాక్ మెయిలర్ టీం అని తెలంగాణ ప్రజల నుంచి ఆరోపణ ఉంది. నాలాంటి వాళ్లతో పాటు అనేక మందిని వాడుకుని కేసీఆర్‌ని కొట్టి రేవంత్ సీఎం పీఠం ఎక్కారు. నమ్ముకుని ఉన్నవాళ్లకు కేసీఆర్ పదవులు ఇచ్చారు. డబ్బులు వాళ్ల వాళ్ల టాలెంట్‌ని బట్టి సంపాదించుకున్నారు. ఈ భూ స్కాంలో ఏ బీఆర్ఎస్ నేతా తక్కువ కాదు. కానీ కవిత ఈనాడు నీతులు వళ్లిస్తుంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బులు , బిజినెస్ మైండ్‌తో ఉండే ఆమె కుటుంబం పదేండ్ల పాలనలో అధికారాన్ని అనుభవించింది. చేయాల్సిన దందాలు చేసింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన రఘు అధికారం లేని సమయంలో బాలానగర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ స్కాం బయటపెట్టాడు. అయితే, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆస్తుల గురించి అడగలేదు ఎందుకు? కవిత ఇంటర్వ్యూ ఇన్స్టాలో ఎందుకు లేదు? వేల కోట్ల భూ స్కాం మీపై పడకుండా ఉండేందుకు, కాపాడుకోవడానికే ఈ ప్లానింగ్ అని స్వేచ్ఛ న్యూస్ నిరూపిస్తుంది.
సాహితీలో పేదలకు చెందిన రూ.7కోట్లు మీ ఇంటికి చేరాయి.. అడగలేదే?
సాహితీ ఇన్ఫ్రా లాంటి కంపెనీలు సొంతింటి కలని వన్ టైం పేమెంట్స్‌తో దోచుకుంటే ఈమె వాటా ఎంతో ఆనాడు రాసింది నేనే. చదివింది ఇదే తొలివెలుగు రఘు. రూ.7 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారో ఐదేండ్ల క్రితం చూపించాను. దానిపై అసలు ప్రశ్న లేదే? ఏ షాపు ఓపినింగ్‌కు వెళ్లినా వట్టి చేతులతో రాలేదు. బిల్ ఇంటికి పంపిస్తే షాప్ ముందు గుంత తవ్వించింది మీరు కాదా? ఏనాడైనా అధికారంలో ఉన్పప్పుడు కేటీఆర్, సంతోష్ రావు, హరీశ్ రావుల కంటే తక్కువ సంపాదించారో చూపిస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు.
ఎక్కడ వాటా లేదో చెప్పండి?
బీజేపీలో బీఆర్ఎస్‌ను కలిపేస్తారని చర్చలు జరిగాయి అందుకే నేను పార్టీని వదిలాను అని అన్నారు. కాదు మీ ఖాందాన్ దోచుకున్న సొమ్ము కోసమని ఎందుకు అనుకోవద్దు. ఆ తర్వాత మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే అన్నింటికి మూలం అని తెలుసుకుని ఇటు వైపు వచ్చి ముసుగులో ఫైటింగ్ చేస్తున్నారు. ఎన్ని లిటిగేషన్ ల్యాండ్స్‌ని క్లియర్ చేసుకున్నారో, ఆ పేరుతో ఎన్ని బెదిరింపులు చేశారో ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమందికే తెలుసు. మీరు ఫైట్ చేసిన భూ దందాలను చూస్తే, శ్రీ ఆదిత్య వద్ద 2 ప్లాట్స్ తీసుకున్నారని లోకం కోడై కూస్తోంది వాస్తవం కాదా? ఇంటర్ వ్యవస్థపై రౌండ్ టేబుల్ పెట్టినా ఎందుకు అంతా ప్రచారం దొరకలేదో తెలంగాణ జర్నలిస్టులకు తెలుసు. వారం రోజుల్లో అయ్యప్ప సొసైటీలో అక్రమాలపై ముట్టడిస్తా అన్నారు, ఎక్కడకు పోయింది మీ ఫైటింగ్ తత్వం. మీరు ఆనాడు ఎన్ని బిల్డింగ్‌లు అక్రమంగా నిర్మించారో చెప్పాలా? మీమ్మల్ని ఇన్నాళ్లు ఏ లింగ భేదం లేకుండా ఫైటర్‌గా చూశాం. కానీ మీ ఉనికి కోసం ఏమైనా చేస్తారని తెలుసుకుని తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీ కార్లు, ఇళ్లు, ఆస్తులు, బినామీలు, మీ అన్నలతో పాటు, మీ బావ, మీ కులంలో గత పదేండ్ల పాలనలో ఎలా సంపాదించారో, అలానే ఇప్పుడు కూడా వాళ్ల లెక్కనే మీరు కూడా ఉన్నారు. తప్పించుకోలేరు.
