Megaverse: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. గతంలో, ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశాడు. పూర్తి స్థాయిలో తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ టాక్ షోతో మన ముందుకు రాబోతున్నారు. ‘మెగావర్స్’ అనే కంప్లీట్ ఎంటర్టైనర్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చిరు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టాక్ షోలో పలువురు స్టార్స్ పాల్గొనబోతున్నారు. ఇక, ‘మెగావర్స్’తో ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించడానికి చిరు స్పెషల్ ఎపిసోడ్స్ తో సిద్ధమయ్యారు. అయితే, ఈ షో ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ నవంబర్ 30న హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ వారు ఓ భారీ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారట.
కాగా, ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్స్ కూడా పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈ షోలో అక్కినేని నాగార్జున, రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజ్ రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్మ్ చరణ్, నాని, సందీప్ రెడ్డి వంగ, సుజీత్ లాంటి ప్రముఖ నటులు కనిపించనున్నారట. ఈ షోకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన వివరాలను లాంచ్ ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు.
ఇక, దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, పరాజయాలను చూసిన చిరు, ఈసారి హోస్ట్‌గా సరికొత్త అవతారంలో సందడి చేయనున్నారు. మన తెలుగు సినిమా గొప్పతనాన్ని, సినీ ప్రముఖుల అనుభవాలతో పాటు, ఆఫ్‌స్క్రీన్‌లో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా కాన్సెప్ట్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.
