Bhogi Trailer: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా భోగి. తాజాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఇప్పటి వరకూ శర్వా నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తైతే..వాటన్నిటికీ పూర్తి భిన్నంగా వస్తోంది భోగి సినిమా. కథ పరంగా ఈసారి తన రూటు మార్చాడు.
కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శర్వా. కానీ, ‘భోగి’ సినిమాతో ఊర మాస్ అవతారంలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు తారా స్థాయిలో ఉండగా, తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
‘భోగి’ సస్పెన్స్‌తో కూడిన ఇంటెన్స్ యాక్షన్..
‘భోగి’ ట్రైలర్‌ను చూస్తుంటే దర్శకుడు సంపత్ నంది కథలోని కీలక అంశాలను పూర్తిగా రివీల్ చేయలేదు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశాడు. 1960 నాటి కాలం..ఒక గ్రామంలో చోటుచేసుకునే సంఘటనలు, వాటి చుట్టూ అల్లుకున్న సంఘర్షణ, దాని మధ్యలో హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. రస్టిక్ విజువల్స్, రక్తపాతంతో కంపోజ్ చేసిన హెవీ యాక్షన్ సీన్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గంగగా శర్వానంద్ విశ్వరూపం..
ఈ సినిమాలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటించాడు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా శర్వా పాత్రను, మేకోవర్‌ను డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉన్నట్లు వారి సన్నివేశాలు, డైలాగులుతో హింట్ ఇచ్చాడు సంపత్ నంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
