సినిమా

Sampath Nandi: భోగి సినిమాతో శర్వానంద్‌కి నేషనల్ అవార్డ్..

Sampath Nandi: భోగి సినిమాతో శర్వానంద్‌కి నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుందంటున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందుతోన్న ఈ భోగి సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శర్వా తాను పోషిస్తున్న గంగా పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ను జరిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది..హీరో శర్వానంద్ గురించి చెసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శర్వా భోగి సినిమాలో పోషించిన గంగా పాత్రకి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ సినిమా కోసం నేను చెప్పిన ప్రతీది కాదనకుండా చేశాడు. బురదలో మునగమంటే మునిగాడు..ఇంత అద్భుతమైన నటన శర్వా గత చిత్రాలలో చూసి ఉండరు అనే విధంగా చెప్పుకొచ్చాడు సంపత్ నంది.

వాస్తవానికి, ఈ సినిమా నవంబర్ 12నే విడుదల కావాల్సింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తికాక పోవడంతో ఆలస్యం అయి..ఎట్టకేలకి నవంబర్ 27న వస్తోంది. ఇక, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ముఖ్యంగా, శర్వా మేకోవర్ రా అండ్ రస్ట్రిక్‌గా ఉంది. 1960 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో భోగి చిత్రం రూపొందుతోంది. దీని, కోసం సంపత్ నంది చాలా నెలలు రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది.

బక్కెట్లతో రక్తం పోసుకోమన్నా, బురదలో దూకమన్నా శర్వా దూకాడు. రాబోయో పదేళ్ళతో ఇలాంటి పాత్రను ఇంకెవరూ చేయలేరేమో.. అని చెప్పుకొచ్చాడు సంపత్ నంది. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి "మా అమ్మా నాన్నలు జన్మనిస్తే.. నాకు మీరు మరో జన్మనిచ్చారు.. అని చెప్పాడంటూ ఎమోషనల్ అయ్యాడు సంపత్ నంది. మొత్తాని, భోగి సినిమాలోని శర్వా పోషించిన గంగా పాత్ర గురించి వింటుంటే ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ దక్కుతుందనిపిస్తోంది.

తర్వాత చదవండి