Mahesh Kumar Goud: కోటి ఓట్లు.. 90 సీట్లు.. లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.
లిబర్టీలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మొదలై ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ర్యాలీ జరుగుతుందన్నారు మహేష్ గౌడ్. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కోటి ఓట్లు, 90కిపైగా అసెంబ్లీ సీట్లు సాధిస్తామని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
