సినిమా

Suriya: "సీన్" విలన్ అందుకున్న కాస్ట్లీ గిఫ్ట్..

మన సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు గనక హీరోకి మాసీవ్ హిట్ ఇస్తే.. ఆ హీరో నుంచి ఖరీదైన బహుమతి అందుతుంటుంది. అంతేకాదు, నిర్మాత కూడా దర్శకుడికి విలువైన బహుమతి ఇస్తుంటాడు. వరుసగా బాలయ్యకి అదిరిపోయో మ్యూజిక్ అందిస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ కారును థమన్ కి బహుమతిగా ఇచ్చాడు. అయితే, తన సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన నటుడుకి తమిళ స్టార్ హీరో సూర్య ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

సినిమాల్లో హీరోలు, విలన్ల మధ్య పోటీ ఉండటం సహజంగానే ఉంటుంది. కానీ, తెరపై ప్రత్యర్థులుగా కనిపించే నటీనటులు నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులుగా మనకి కనిపిస్తుంటారు. చాలా సందర్భాలలో పబ్లిక్ ఈవెంట్స్‌లో ఈ విషయాన్ని అభిమానులకి చెప్పారు కూడా మన స్టార్స్ కొందరు. మేము బాగానే ఉంటాము. కానీ, మాకోసం మీరే గొడవలు పడుతుంటారు అని.

ఇక, తాజాగా కోలీవుడ్ హీరో సూర్య తన లేటెస్ట్ సినిమా సీన్ లో విలన్‌గా నటించిన మలయాళ నటుడి ప్రతిభకు ఫిదా అయి ఖరీదైన బహుమతి ఇచ్చాడు. అది వాచ్ కావడం విశేషం. దీని విలువ సుమారు

రూ.9 నుంచి 12 లక్షలని తెలుస్తోంది.

విలన్‌కి కార్టియర్ వాచ్ గిఫ్ట్!

మలయాళ యువ నటుడు నస్లెన్ కు హీరో సూర్య ఈ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సీన్ మూవీలో నస్లెన్ 'ఈశ్వరన్' అనే కిరాయి హంతకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అతని విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, సూర్య లాంటి స్టార్ హీరోకు ధీటుగా నిలబడి తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో, సూర్య ఎంతో సంతోషపడి..తన సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంటున్న నస్లెన్ బ్రాండెడ్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నస్లెన్..సూర్య గొప్పమనసుకు పొంగిపోయి ఎంతో ఎమోషనల్ అవుతూ కృతజ్ఞతలు తెలిపాడు.

తర్వాత చదవండి