Kollywood-O.M Movie: శ్రీలీలకి బలమైన పాత్ర దక్కలేదు..అవును, తాజాగా వచ్చిన ఓం సినిమా చూసిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు చెప్తున్న మాట ఇది. సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రను బలంగా రాసుకునే దర్శకులు పూరి జగన్నాధ్, రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళే. ఒక్కోసారి, కొరటాల శివ..త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కూడా హీరోయిన్ పాత్రకి అంతగా ప్రాధాన్యం ఉండదు.
ముఖ్యంగా, గురూజీ సినిమాలలో సెకండ్ లీడ్ చేసే హీరోయిన్ ఎప్పుడు సంతృప్తి పడిన సందర్భాలు కనిపించలేదు. ఇటీవల వచ్చిన ఆదర్శకుటుంబం సినిమా విషయంలో కూడా అదే కనిపించింది. ఇక, కీలక పాత్ర కోసం తీసుకున్న పూజిత పొన్నాడ కూడా ఆదర్శకుటుంబం టీమ్ నన్ను మోసం చేసిందని వాపోయింది.
ఇదంతా, ఇప్పుడు చర్చించడానికి కారణం, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ఓం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. అలాగే, సాయి పల్లవి..శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటించారు. వీరిద్దరు ఓం సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ, ఒక్క ధనుష్ పాత్ర తప్ప మిగతా మూడు పాత్రల్లో ఏమాత్రం బలం లేదని సినిమా చూసిన అభిమానులు కుండబద్దలు కొడుతున్నారు. సాయి పల్లవి పాత్ర సో సోగా ఉందని, మమ్ముట్టి పాత్రను సరిగ్గా ఎలివేట్ చేయలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అలాగే, శ్రీలీల పాత్ర అసలు ఎందుకుందో తెలియదని మాట్లాడుతున్నారు. దీన్నిబట్టి చూస్తే తమిళంలో సాయి పల్లవి నటించిన లేటెస్ట్ సినిమా ఓం ఆమెకి ఏమాత్రం ఉపయోగపడని అర్థమవుతోంది.
