సినిమా

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు..

4 నిమిషాల పఠనం

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు. అయితే, వీటిలో ఏ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుంది..ఏ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంటుంది..ఏది ఫ్లాప్ టాక్‌తో ట్రోల్స్ కి గురౌవుతుంది అన్నది వార్‌లో తేలిపోతుంది. కానీ, ఇప్పుడున్న సమాచారం మేరకు ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటాయని తెలుస్తోంది.

Tollywood: డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్న 4 చిత్రాలు. అయితే, వీటిలో ఏ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుంది..ఏ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంటుంది..ఏది ఫ్లాప్ టాక్‌తో ట్రోల్స్ కి గురౌవుతుంది అన్నది వార్‌లో తేలిపోతుంది. కానీ, ఇప్పుడున్న సమాచారం మేరకు ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటాయని తెలుస్తోంది.

వృష కర్మ:

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తయారవుతోంది వృష కర్మ. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుత, ప్రమోషనల్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. మిగతా సినిమాల కంటే వృష కర్మ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తండేల్ లాంటి భారీ హిట్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రీ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరుగుతోంది.

నాని-నితిన్-అలియాస్ రుక్మిణి:

గత కొన్నేళ్ళుగా నితిన్‌కి ఉన్న యూత్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా హిట్ పడటం లేదు. క్లాస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నితిన్..జానర్ మార్చి మాస్ అండ్ యాక్షన్ సినిమాలంటూ, అందరికీ తెలిసిన, అలవాటైన కథలతో వచ్చి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. ఇప్పుడు, ఆ ఫ్లాప్స్ నుంచి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నం అలియాస్ రుక్మిణి. క్యూట్ లవ్‌స్టోరీతో ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. నానికి, నిర్మాతగా ఈ సినిమా హిట్ చాలా అవసరం.

మైసాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే:

పుష్ప సిరీస్, అనిమల్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్, సికందర్, కుబేర, రణబాలి లాంటి సినిమాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు, రష్మిక మందన్న ఆశలన్నీ హెవీ యాక్షన్ సినిమాగా వస్తోన్న మైసా మీదే పెట్టుకుంది. అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు హిందీలో శ్రద్ధా కపూర్ నటించిన ‘ఈతా’ కూడా డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనుంది. మొత్తానికి, ఈ ఏడాది ఆఖరు నెల మొదటి వారం బాక్సాఫీస్ వద్ద సందడి బాగానే ఉండబోతోంది.

#Tollywood#Vrusha Karma#Mysaa#Alias Rukmini#Eetha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి