Tollywood: గత కొంతకాలంగా మన సెలబ్రిటీలు ఒకరి సినిమాకి ఒకరు సపోర్ట్ చేయడం..ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడం చూస్తున్నాము. ఇటీవలే, ఓ చిన్న సినిమాకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వచ్చి చిత్ర బృందానికి, హీరోకి అండగా నిలిచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపి..సక్సెస్‌కి కారణమయ్యారు. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’పై ఎన్టీఆర్ కూడా తన మద్దతు తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ‘ఆకాశంలో తార’ సినిమాకు స్పెషల్ గా ప్రశంసలు, శుభాకాంక్షలు రావడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ ఈ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. అప్పటి నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.
ఇక, ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పేర్కొన్నారు. దీనికి, కారణం నాకు ఎంతో ఆత్మీయులైన వ్యక్తులు ఈ ప్రాజెక్టులో భాగం కావడమేనని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ముఖ్యంగా, నిర్మాతలు సన్నీ గుణ్ణం, రమ్య గుణ్ణం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కోసం ముందు నుంచి ఎంతగానో కష్టపడ్డారు.. ఇది నాకు తెలుసు..అని తారక్ వెల్లడించారు.
అంతేకాదు, స్వప్న సినిమాస్ అధినేత స్వప్న దత్, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్..వీరిద్దరూ ఎప్పుడూ కొత్త కథలను, కొత్త వారి ప్రతిభను ప్రోత్సహిస్తుంటారని కూడా తారక్ ప్రశంసించారు. వీరు మంచి సినిమాలపై పెట్టే నమ్మకం ఎప్పుడూ ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మొత్తానికి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్..ఇప్పుడు సినిమా రిలీజైయ్యాక తారక్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం..ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇక, పవన్ సాదినేని అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకి అందించాడు. ప్రతీ ఒక్కరు ఆయన్ను ప్రశంసించాల్సిందే.
