Tech News: టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. కొత్త కొత్త అప్డేట్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ టెక్ రంగంలో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి? ఏ బ్రాండ్ నుంచి కొత్తగా ఏమేం వస్తున్నాయి? అందులోని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం..
గేమర్స్‌కు అదిరిపోయే బంపర్ డీల్!
ప్రముఖ గేమింగ్ బ్రాండ్ రేజర్ నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్ అందుబాటులో ఉంది. గేమింగ్ మౌస్, గేమింగ్ హెడ్‌సెట్‌తో పాటు ఒక స్టాండ్.. ఇలా మూడు ప్రొడక్ట్స్ కలిపి కేవలం రూ.1,917కే లభిస్తున్నాయి. మంచి బ్రాండ్ నుంచి గేమింగ్‌కు అవసరమైన మూడు యాక్ససరీస్ ఒకే ప్యాకేజీలో రావడం నిజంగా బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

GTA 6.. గేమింగ్ ప్రపంచంలో సరికొత్త సంచలనం!
గేమింగ్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ GTA 6. ఈ గేమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. GTA 6 డెవలప్మెంట్ కోసం దాదాపు 13ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఈ గేమ్ నిర్మాణానికి సుమారు 1 బిలియన్ ప్లస్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రీ-ఆర్డర్ల విషయానికి వస్తే.. 17 మిలియన్ ప్లస్ కాపీలు కొన్నారు. వాటి విలువ దాదాపు 1.65 బిలియన్ డాలర్స్. గతంలో GTA 5 ప్రపంచవ్యాప్తంగా సుమారు 235 మిలియన్ కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించింది. ఇక అత్యధికంగా అమ్ముడైన గేమ్‌గా Minecraft సుమారు 350 మిలియన్ కాపీలతో ముందుంది.
GTA 6కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఈ అమ్మకాల రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉందని గేమింగ్ మార్కెట్లో అంచనా. ఇక మన ఇండియాలో ధర విషయానికి వస్తే.. స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,499గా.. టాప్ ఎడిషన్ ధర సుమారు రూ.8వేల వరకు ఉండొచ్చని అంచనా. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. GTA 6 అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు పని చేస్తున్నారు. ఇందులో భారతీయ డెవలపర్ల భాగస్వామ్యం కూడా ఉంది. మన ఇండియా నుంచి 1600 మంది డెవలపర్స్ ఉండటం విశేషం.

Vivo X500 సిరీస్.. ఫోన్ల ధరలు చూస్తే షాకే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి వస్తున్న X500 సిరీస్ ఇప్పుడు టెక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 26న భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి ధరలు లీక్ అయ్యాయి. బేస్ మోడల్ Vivo X500 ధర దాదాపు రూ.1,19,999 ఉండొచ్చని అంచనా. ఇక X500 Pro ధర సుమారు రూ.1,49,999గా ఉండొచ్చని తెలుస్తోంది. అత్యంత ప్రీమియం మోడల్ X500 Pro Max ధర రూ.1,59,999 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.1,79,999 వరకు ఉండొచ్చని సమాచారం. కెమెరా ప్రియుల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న Master Photography Set ధర రూ.2,29,999 వరకు ఉండొచ్చని అంచనా.

Open AI నుంచి స్మార్ట్‌ఫోన్..
OpenAI తన సొంత AI స్మార్ట్‌ఫోన్ డెవలప్ చేస్తున్నట్లు టెక్ ప్రపంచంలో వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ChatGPT ఇంటిగ్రేషన్‌తో పాటు పూర్తి స్థాయిలో AI ఆధారిత ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇందులో కస్టమైజ్ చేసిన MediaTek Dimensity 9600 చిప్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. అలాగే LPDDR 6 RAM, UFS 5.0 స్టోరేజ్, డ్యూయల్ AI ప్రాసెసింగ్ యూనిట్లు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. దీన్ని గ్లోబల్ గా తీసుకొస్తారా, ఇండియాలోకి వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది. AI చాట్ బాట్ ChatGPT తో ప్రపంచాన్ని ఆకట్టుకున్న OpenAI.. సొంత స్మార్ట్‌ఫోన్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
