తెలంగాణ

T Congress: పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు- మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్

T Congress: ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ పరిశీలన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో కొండా సురేఖ విషయంలోనూ అదే జరిగిందన్నారు. మొదటిసారే ఏఐసీసీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రెండు మూడుసార్లు పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ చర్యలు తీసుకుందని వివరించారు.

T Congress: సొంత ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ నే రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేయడం దుమారం రేపింది. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ గీత దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సరైన సమయంలో నిర్ణయం

ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ పరిశీలన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో కొండా సురేఖ విషయంలోనూ అదే జరిగిందన్నారు. మొదటిసారే ఏఐసీసీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రెండు మూడుసార్లు పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ చర్యలు తీసుకుందని వివరించారు.

కొండా సురేఖ విషయంలో మొదటిసారే చర్యలు తీసుకోలేదు

''కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. ఈ కారణంగా కొంత కాలం పడుతుంది. కొండా సురేఖ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదటిసారే చర్యలు తీసుకోలేదు. రెండు మూడుసార్లు అలాంటి ఘటనలు జరిగిన తర్వాతే ఏఐసీసీ చర్యలు తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి అయినా, అనిరుధ్ రెడ్డి విషయం అయినా.. అన్నీ ఆచితూచి పరిశీలించి సరైన సమయం వచ్చినప్పుడు ఏఐసీసీ దానిపై స్పందిస్తుంది'' అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

వేటు ఖాయమా?

రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల అంశం ఏఐసీసీ పరిశీలనలో ఉందని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వారిద్దరిపై వేటు తప్పదా? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

తర్వాత చదవండి