సినిమా

Kollywood: ‘ఓం’ చిత్రానికి ధనుష్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్

Kollywood: తమిళ స్టార్ హీరో ధనుష్ కెరీర్‌లో మరో భారీ విజయం చేరబోతోందా? ఆయన నటించిన ‘ఓం’ సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ రకంగానే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించినదని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా, ఈ సినిమా కంటెంట్, దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన విధానం, టేకింగ్, ధనుష్ క్రేజ్ కలిసి ఈ రేంజ్‌లో ఓపెనింగ్ డే వసూళ్లు భారీ స్థాయిలో వచ్చాయంటున్నారు. స్పై యాక్షన్ సినిమాగా వచ్చిన ఓం చిత్రానికి ముందు థియేటర్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ లో బలమైన కథ లేదనే కామెంట్స్ ఎక్కువ వినిపించాయి. కానీ, ఈ చిత్రం ఊహించని వసూళ్లను రాబట్టింది.

ధనుష్ మొత్తం కెరీర్ లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్టు తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఆయన కెరీర్ లో విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఓం సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన్నట్టు మేకర్స్ ప్రకటించారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్ లలోనూ, ధనుష్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని మేకర్స్ వెల్లడించారు.

ఒక్క తమిళనాడు నుంచే 16 కోట్లకి పైగా ఓం చ్త్రం గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక, మన తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్లు వచ్చాయట. ఈ రకంగా, అన్ని చోట్ల నుంచి ధనుష్ గత చిత్రాలకంటే ఎక్కువగానే ఈ సినిమా పెర్ఫామ్ చేసింది. మరి, లాంగ్ రన్ లో వసూళ్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. కాగా, ఈ సినిమాలో సాయి పల్లవి, మమ్ముట్టి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు.

తర్వాత చదవండి