జాతీయం

Trending: భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతల్లో పెను మార్పులు.. గూగుల్ నివేదికలో ఆసక్తికర విషయాలు!

భారతీయుల ప్రయాణ అభిరుచులు, పర్యాటక ప్రణాళికల్లో 2026 నాటికి గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని గూగుల్ తాజా ప్రయాణ ట్రెండ్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. గతంలో మాదిరిగా వారం రోజుల పాటు హడావిడిగా పర్యాటక ప్రాంతాలను చుట్టిరావడానికి బదులుగా, మానసిక ప్రశాంతతనిచ్చే 'వెల్నెస్ ట్రావెల్'(wellness travel), ఒకరోజు విహారయాత్రలు, సోలో ట్రావెల్ (Solo travel) వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు గూగుల్ డేటా వెల్లడించింది.

 భారతీయుల ప్రయాణ అభిరుచులు, పర్యాటక ప్రణాళికల్లో 2026 నాటికి గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని గూగుల్ తాజా ప్రయాణ ట్రెండ్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. గతంలో మాదిరిగా వారం రోజుల పాటు హడావిడిగా పర్యాటక ప్రాంతాలను చుట్టిరావడానికి బదులుగా, మానసిక ప్రశాంతతనిచ్చే 'వెల్నెస్ ట్రావెల్'(wellness travel), ఒకరోజు విహారయాత్రలు, సోలో ట్రావెల్ (Solo travel) వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు గూగుల్ డేటా వెల్లడించింది. ముఖ్యంగా 'వెల్నెస్ ట్రావెల్ ఇండియా'(wellness travel india) కోసం చేసే ఇంటర్నెట్ శోధనలు ఏకంగా 1,600 శాతం పెరగడం విశేషం.

 ఇదే సమయంలో 'ఫిట్‌నెస్ ట్రిప్'(fitness tips) సెర్చ్ 950 శాతం, నిశ్శబ్ద వాతావరణంలో సేదతీరే 'సైలెంట్ రిట్రీట్స్'(silent retreats) కోసం వెతికే వారి సంఖ్య 150 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సంప్రదాయ పర్యాటక ప్రదేశాలకు భిన్నంగా కొత్త అనుభూతులను ఇచ్చే మార్గాలను భారతీయ పర్యాటకులు అన్వేషిస్తున్నారు. ‘నా సమీపంలోని హైకింగ్ మార్గాలు’ (Hiking trails near me), మ్యూజిక్ ఫెస్టివల్స్ (A Journey Through Music Festivals) వంటి అంశాలతో పాటు, ఎవరికీ అంతగా తెలియని ‘భారతదేశంలోని దాగి ఉన్న ఆణిముత్యాలు’ (hidden gems) కోసం చేసే సెర్చ్‌లు 400 శాతం మేర పెరిగాయి.

 తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలను చూడాలనే తొందర లేకుండా, ఒకే గమ్యస్థానంలో ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి సంస్కృతిని ఆస్వాదించే 'స్లో ట్రావెల్' (Slow Travel) విధానంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు బిజీ జీవనశైలి కారణంగా సుదీర్ఘ సెలవులు దొరకని వారు వారాంతపు విహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది కాలంలో ‘ఒక రోజు పర్యటన’ (one day trip) కోసం చేసే శోధనలు 130 శాతం పెరగగా, దేశవ్యాప్తంగా ఈ విభాగంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.

 వసతి ఎంపికల్లోనూ ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా "పెంపుడు జంతువులకు అనుకూలమైన హోటళ్లు, సరసమైన హోమ్‌స్టేలు, కుటుంబానికి అనువైన గమ్యస్థానాలు కోసం ప్రత్యేకంగా వెతుకుతున్నారు. అదేవిధంగా దేశంలో సోలో ట్రావెల్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఉత్తమ ఒంటరి ప్రయాణ ప్రదేశాలు, బడ్జెట్ గైడ్‌లతో పాటు, ప్రయాణాల్లో కొత్త స్నేహితులను కలుసుకునేందుకు 'ట్రావెల్ కమ్యూనిటీ' కోసం చేసే సెర్చ్‌లు 400 శాతం పెరిగాయి. వీటన్నింటికీ తోడు తమ పర్యటనలను సులభంగా ప్లాన్ చేసుకునేందుకు 'ప్రయాణం కోసం ఏఐ' (AI for travel) సాధనాల వినియోగం 600 శాతం పెరగడం పర్యాటక రంగంలో సాంకేతికత పాత్రను తెలియజేస్తోంది.

తర్వాత చదవండి