తెలంగాణ

Hyderabad hotels : అపరిశుభ్రత, క్వాలిటీ లెస్.. బావర్చి సహా ఫేమస్ హోటల్స్ లైసెన్సులు రద్దు!

హైదరాబాద్‌లోని హోటళ్లపై టీజీ సేఫ్ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝుళిపించారు.కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు క్యూర్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని హోటళ్లపై టీజీ సేఫ్ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝుళిపించారు.కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు క్యూర్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 స్పెషల్ టీమ్స్, 9 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన నిబంధనలు పాటించని 4 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు మరో రెండింటిని సీజ్ చేశారు.

అపరిశుభ్రత, క్వాలిటీ లెస్ ఫుడ్ సరఫరా..

టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ది స్పైస్ కిచెన్ (కూకట్‌పల్లి), రాజు గారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్), మాదాపూర్ బావర్చి (అయ్యప్ప సొసైటీ), మెహఫిల్ రెస్టారెంట్ (బల్కంపేట్), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్), మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్ (టోలీచౌకి), అల్ కరీం బేకర్స్ (టోలీచౌకి), శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి) వంటి హోటల్స్‌ వినియోగదారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు.

అయితే, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని బావర్చి, కూకట్‌పల్లిలోని ‘ది స్పైస్ కిచెన్’, టోలిచౌకిలోని ‘మాతమ్ అల్ యమానీ అరేబియన్ రెస్టారెంట్’, చందానగర్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతో వారి లైసెన్సులు సస్పెండ్ చేశారు. వాటిని పునరుద్ధరించే వరకు ‘స్విగ్గీ, జొమాటో’ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ హోటల్స్ తొలగించాలని అధికారులు ఆదేశించనున్నట్టు సమాచారం.అదేవిధంగా టోలీచౌకిలోని అల్ కరీం బేకర్స్, గౌలిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్స్‌ను అధికారులు మూసివేశారు.

ఆహార పదార్థాల నమూనాల సేకరణ..

హోటల్స్‌లో నిర్వహించిన సోదాల్లో భాగంగా ఆహార పదార్థాల్లో కల్తీ జరిగి ఉండవచ్చనే అనుమానంతో మొత్తం 8 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. సుమారు 135 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి పారవేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు టీజీ సేఫ్ అధికారులు స్పష్టం చేశారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్టు టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు.

తర్వాత చదవండి