సినిమా

January 12 Vidudala: అదిరింది వదిన మరదళ్ళ మాస్ సాంగ్ 'డివికి డివికి'..

January 12 Vidudala: హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న జనవరి 12 సినిమా నుంచి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. దీనిలో, భాగంగా ముందు దళపతి సినిమాలోని సీన్‌కి రీక్రియేట్ చేస్తూ వదిలిన అప్‌డేట్..దీని తర్వాత వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా..ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ వదిలారు. ఇందులో, అందాల భామలు కీర్తి సురేష్-కృతి శెట్టి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

గత కొన్నేళ్ళ నుంచి ప్రతీ సంక్రాంతికి తన సినిమాతో వచ్చి ప్రమోషన్లలో అనిల్ రావిపూడి తనదైన స్టైల్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. 2027, సంక్రాంతికి అదే తేదీకి రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘డివికి డివికి డిక్కుమ్’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను, అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

వదిన మరదళ్ల మధ్య మాస్ సాంగ్ అదిరిపోయింది!

జనవరి 12 విడుదల సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బమ్మర్దులుగా నటించారు. అలాగే, వదిన, మరదళ్లగా కీర్తి సురేష్, కృతి శెట్టి అలరించబోతున్నారు. ఇక, ఈ పాటలో వీరిద్దరు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ లంగా ఓణీల్లో కనిపిస్తూ కీర్తి-కృతి వేసిన మాస్ స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. వదిన, మరదళ్ల మధ్య సాగే ఈ పాటలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇద్దరి డ్యాన్స్, ఎనర్జీ ప్రేక్షకులను థియేటర్స్‌లో మాస్ స్టెప్పులేయించడం గ్యారెంటీ అనిపిస్తోంది.

కాగా, ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘డివికి డివికి’ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, మధుప్రియ, హరిప్రియ పాడారు. హుషారైన బీట్స్‌తో ఈ పాటను మంచి సెలబ్రేషన్ నంబర్‌గా తెరకెక్కించారు బృంద మాస్టర్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె కంపోజ్ చేసిన సాంగ్ ఇదే కావడం విశేషం. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బాబు సమర్పకుడు.

YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి