Tollywood: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ సినిమా దాదా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్నీ విధాలా శ్రమిస్తూ రాత్రంబవళ్ళు పని చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి దాదాను దింపాలని.
దాదా వాయిదా..మళ్ళీ కొత్త తేదీ ఎప్పుడు?
అయితే, దాదా సినిమా షూటింగ్లో బాలయ్యకి గాయం అయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఆయనకి సర్జరీ అయి దాదాపు రెండు నెలలపాటు షూటింగ్లో పాల్గొనలేకపోయాడు. దీంతో, ఈ సినిమాకి జాప్యం జరిగిన మాట వాస్తవమే. నిజానికి, దసరా లేదా దీపావళికి భారీ స్థాయిలో దాదాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఈ కారణం వల్లే సినిమా వాయిదా పడి క్రిస్మస్ కి ప్లాన్ చేశారు.
అయితే, ఈ సినిమాకి అనుకున్న విధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా వేసే అవకాశాలున్నాయని..జనవరి మొదటి వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. కానీ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బాలయ్య దాదా సినిమాకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నెలాఖరు వరకూ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు షూట్ మొత్తం పూర్తి చేయనున్నాడు.
ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తైపోతోంది. డిసెంబర్ 2వ వారం నుంచి నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 24న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేదే దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలకృష్ణ పెట్టుకున్న టార్గెట్. మిగతా సినిమాలు అదే రోజు రిలీజ్ అయినా కాకపోయినా..బాలయ్య దాదా మాత్రం వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. అయితే, ఇదే డేట్ కి రిలీజ్ అనుకున్న కింగ్ 100 మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.
