Tollywood: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రుపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల. ఈ సినిమాను 2027, జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా, అనిల్ మార్క్ స్టైల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఫస్ట్ సింగిల్ 'డివికి డివికి' అంటూ సాగే మాస్ సాంగ్‌ను వదిలారు మేకర్స్. ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్న ఈ పాట ట్యూన్ మాత్రం కొత్తది కాదంటున్నారు.
వచ్చుండాయ్ ఫీలింగ్సు..
జనవరి 12 విడుదల సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ-బామ్మర్ది పాత్రల్లో నటిస్తున్నారు. అందుకే, టైటిల్ కింద బావ బామ్మర్ది సౌజన్యంతో అన్న ట్యాగ్ పెట్టాడు అనిల్ రావిపూడి. దీనిని బట్టి, కీర్తి సురేష్-కృతి శెట్టిలు వదిన-మరదళ్ళుగా కనిపించబోతున్నారు. కాబట్టే, తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్‌లో ఆ పదాలను వాడారు సాహిత్య రచయిత. పండగ వాతావరణంలో కలర్ఫుల్గా బృంద మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీతో ఇద్దరు అందమైన అమ్మాయిలతో అదరగొట్టే పాటను తీశారు.
కానీ, ఈ పాట ట్యూన్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన వచ్చుండాయ్ ఫీలింగ్సు సాంగ్ మాదిరిగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలలోని పాటల విషయంలో ఇదే జరుగుతోంది. ఇంతకముందు విన్న పాటల ట్యూన్స్ మళ్ళీ విన్నట్టుగా ఉందని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు వచ్చిన జనవరి 12 విడుదల ఫస్ట్ సింగిల్ కూడా అచ్చం పుష్ప 2 సినిమాలోని పాట తాలూకు స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మరి, చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ ట్యూన్ చేసినప్పుడు..అనిల్ రావిపూడి విన్నప్పుడు ఆ పాట గుర్తు రాలేదేమో. ఏదేమైనా, జనవరి 12 విడుదల ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం ఆశించినంతగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. మరి, ఇక నుంచి వచ్చే సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
