Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలు.. తమ తోటీ హీరోయిన్స్‌కి, ఇతర నటీనటులకు సర్ప్రైజింగ్గా విషెస్ చెప్తే..వాళ్ల ఆనందం మాటల్లో చెప్పలేరు. ఇప్పుడు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇలాంటి స్వీట్ సర్ప్రైజింగ్ ట్వీట్‌ను సమంత-రాజ్‌లకి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ దంపతుల ఆనందాన్నికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవలే వీరికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా చరణ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపాడు.
పుట్టగానే పెరు పెట్టిన సమంత-రాజ్:
సమంతకి బాబు పుట్టగానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, బాబు పేరు 'దేవ్ నిడిమోరు'గా కూడా ప్రకటించడం చాలామందికి సర్ప్రైజింగ్గా అనిపించింది. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత 21వ రోజుకి పేరు పెట్టే ఆనవాయితీ, సంసృతీ ఉంటాయి. కానీ, వీరు మాత్రం అన్నిరోజులు ఆగలేకపోయారు. కట్టలు తెంచుకునే ఆనందంలో మునిగితేలుతున్న రాజ్ నిడిమోరు..సమంతలు తమ బాబు పేరును వెంటనే ప్రకటించారు.
ఇక, బాబు పేరు అద్భుతంగా ఉందని చాలామంది సన్నిహితులు ఈ జంటతో చెప్తున్నారు. అయితే, తనకి మొదటి సంతానంగా బాబు పుడతాడని సమంత కొన్నేళ్ళ క్రిదంటే చెప్పడం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగింది. ఊహించి చెప్పిందా..లేదా ఆశతో చెప్పిందా అన్నది తెలియదు గానీ, తనకి ముందుగా పుట్టబోయోది మగ బిడ్డ అని ఒక షోలో చెప్పిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
సమంత-రాజ్‌లను చరణ్ శుభాకాంక్షలు:
సమంత-రాజ్ నిడిమోరుల దంపతులకి మగ బిడ్డ జన్మించిన సందర్భంగా రామ్ చరణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. “ప్రియమైన సమంత, రాజ్‌లకు.. మీ చిన్నారి రాక సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఇద్దరికీ, ఆ చిన్నారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఆయన తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. కాగా, రామ్ చరణ్, సమంత కలిసి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో నటించారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
