Anupama Parameswaran: మాస్ అండ్ యాక్షన్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భోగి. ఈ సినిమా నేడే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించాడు. ఇందులో హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటించారు. అయితే, విడుదలకి ముందు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. వీటికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరు కాలేకపోయింది. తాజాగా, దీనికి క్లారిటీ ఇచ్చింది అనుపమ.
ఊటీ షూటింగ్ కారణంగా ప్రమోషన్స్‌కు దూరం..
తాజాగా, అనుపమ పరమేశ్వరన్ భోగి సినిమా ప్రమోషన్స్ కి హాజరవని విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కారణాన్ని తెలిపింది. ఈ సినిమా అవుట్‌పుట్ బాగుండాలనే ఉద్దేశంతో అలాగే, టెక్నికల్ గా ఇబ్బందులు రావడంతో విడుదల తేదీ పలుమార్లు మారిందని, ఆ మార్పులకు తగ్గట్టుగా తన డేట్స్‌ను సర్దుబాటు చేయాలనుకున్నప్పటికీ, ఆల్రెడీ కమిట్ అయిన మరో సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది అనుపమ.
ఇది ఆల్రెడీ మేకర్స్‌కి చెప్పగా..భోగి టీమ్ తన పరిస్థితిని అర్థం చేసుకుదని చెప్పింది. తన అభ్యర్ధనను అర్థం చేసుకొని సహకరించినందుకు కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా చెప్పింది. భోగి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడం తనకు కూడా బాధగా ఉందని, నేను ప్రమోషన్స్‌లో లేకపోయినా.. నా మనసంతా చిత్రబృందంతోనే ఉందని చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు థియేటర్లలో భోగి సినిమాను చూసే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ వెల్లడించింది.
ఇక, ఈ సినిమాలో అనుపమ పాత్రకి మంచి పేరొస్తుందని కూడా చాలా నమ్మకంగా ఉంది. మరో హీరోయిన్‌గా డింపుల్ హయాతి నటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోగి సినిమాకి ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి, లాంగ్ రన్‌లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి సరికొత్త రికార్డ్స్‌ను నమోదు చేస్తుందో చూడాలి. కాగా, ఈ సినిమా సక్సెస్ అనేది దర్శకుడు సంపత్ నందికి చాలా కీలకంగా మారింది.
