తెలంగాణ

IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ‌కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.. ఏ2 ఎవరంటే?

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు (Trainee IPS Uday Krishna Reddy) విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు అవ్వకుండా ఉండేందుకు ట్రైనీ ఐపీఎస్ సోదరుడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏ2 గా ప్రణయ్ కృష్ణారెడ్డి..

ఈ క్రమంలోనే ట్రైనీ ఐపీఎస్ తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చిన దర్యాప్తు అధికారులు, తాజాగా ప్రణయ్‌ను ఏ2 కింద ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో ప్రణయ్ కృష్ణారెడ్డికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయగా ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను ప్రణయ్ ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన వీడియో ఆధారాలు ఉన్న మరో ఐఫోన్‌ను కూడా పోలీసులకు చిక్కకుండా మాయం చేసినట్టు సమాచారం.ఈ రెండు వ్యవహారాల్లో ప్రణయ్ కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.

దాంతో సాక్ష్యాల ట్యాంపరింగ్ కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ప్రణయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్లు తెలిసింది. అయితే, ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బయట వేరే మహిళలతో సంబంధాలు ఉన్నట్టు విచాణలో పోలీసులు తేల్చారు. వేధింపులు ఎదుర్కొన్న ట్రైనీ ఐపీఎస్‌తో పాటు మరో మహిళ కూడా ఉదయ్ చేతిలో మోసపోయినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.కాగా, ఈ కేసు విచారణకు మరికొంత సమయం పడుతోందని సమాచారం.

తర్వాత చదవండి