AA23: ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో అటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ క్రేజ్ ఉన్నటువంటి కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)-లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ల సినిమా. ఇది, అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ లో 23వ చిత్రంగా రానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం.. ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
అయితే, ఈ పాన్ ఇండియా సినిమా విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. క్రేజీ రైటర్ లోకేష్‌తో కలిసి ఈ మూవీకి స్క్రిప్ట్ వర్క్‌లో జాయిన్ అయ్యాడు. ఇంతకముందు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో స్క్రిప్ట్ లో కలిసి పని చేసిన యువ రచయిత, దర్శకుడు రత్న కుమార్ మళ్ళీ ఇప్పుడు.. కొత్త ఆరంభం.. అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాలు మాస్టర్, విక్రమ్, లియో కోలీవుడ్‌లో భారీ కమర్షియల్ సక్సెస్‌లను సాధించాయి. ఇప్పుడు, మళ్ళీ రత్న కుమార్.. లోకేష్ తో కలవడంతో అల్లు అర్జున్ సినిమా కోసమే అని కన్‌ఫర్మ్ అయింది. కాగా, రత్న కుమార్ నుంచి ఈ ఏడాదిలో ’29’ అనే రోమ్ కామ్ మూవీ కూడా వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
కమల్ హాసన్ నటించిన విక్రమ్, విజయ్ నటించిన లియో, మాస్టర్ చిత్రాలు తమిళ ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. దాంతో, మళ్ళీ అల్లు అర్జున్ సినిమాకి వీరు కలవడంతో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో అనే ఆసక్తి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో రేకెత్తుతోంది. చూడాలి, మరి ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు రానుందో. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమాను చేస్తున్నాడు. దీపిక పడుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
