#AliasRukmini: యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’(#AliasRukmini: ). నాని(Nani) సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే పెరుగుతోంది. ఇప్పటికే, విడుదలైన థియోట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు స్థాయిలో పెంచగా, ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో, ఈ సినిమా విడుదలకు సంబంధించిన మిగతా పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.
ఇక, ‘అలియాస్ రుక్మిణి’(#AliasRukmini) చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఊపందుకున్నాయి. అంతేకాదు, ఎలాంటి కట్స్ గానీ, మ్యూట్స్ గానీ లేకుండా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో, దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించిన పూర్తి కథను థియేటర్లలో అన్నీ వయసుల ప్రేక్షకులు చూడవచ్చు. ఇక, ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 17 నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 4న థియేటర్లలోకి..
నేచురల్ స్టార్ నాని సమర్పణలో, మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ హీరోయిన్గా నటించింది. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. నాని సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
వృష కర్మకి పోటీగా అలియాస్ రుక్మిణి:
అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న వృష కర్మ కూడా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సుకుమార్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే, సినిమాపై మంచి బజ్ క్రియోట్ అయింది. అందుకే, నితిన్ నటించిన అలియాస్ రుక్మిణి చిత్రానికి నాగ చైతన్య వృష కర్మ గట్టి పోటీని ఇవ్వబోతోంది. మరి, ఈ రెండు సినిమాలలో ఏది వసూళ్ళ పరంగా సాలీడ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
