సినిమా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డేట్ లాక్..

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హీరోయిన్‌గా రీనిధి శెట్టి నటించింది. కీలక పాత్రలో నివేతా పేతురాజ్, నారా రోహిత్..స్పెషల్ నంబర్‌లో డింపుల్ హయాతీ అలరించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య వచ్చి ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకి గురూజీ అద్భుతమైన కథ, మాటలను అందించాడు. విజయ్ భాస్కర్ డైరెక్షన్‌కి వెంకీ కామెడీ ఎమోషన్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి భారీ హిట్ సాధించాయి. ఈ రెండు సినిమాలకి త్రివిక్రమ్ అందించిన కథ-మాటలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ కూడా సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణమయ్యాయి.

దాంతో, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆదర్శకుటుంబం మీద అంచనాలు తారా స్థాయిలో పెరిగాయి. కానీ, ఈ సినిమా ఎందుకనో ప్రేక్షకులకి కనెంక్ట్ కాలేదు. ఫ్లాప్ టాక్‌తో చాలామంది థియేటర్లలో సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. కొందరు మిస్ అయ్యారు. వారికోసం ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాను ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక, ఈ సినిమా దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా త్వరలో అందుబాటులోకి వచ్చే సినిమాల జాబితాలో ఆదర్శకుటుంబం స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ, ఈ శుక్రవారం(నవంబర్ 27) నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కాగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

తర్వాత చదవండి