Shruti Haasan: గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్. కమర్షియల్ సినిమాలు, గ్లామర్ రోల్స్ దాదాపు పక్కన పెట్టింది. ఇటీవలే ఆకాశంలో ఒక తార సినిమాతో వచ్చి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దర్శకుడే తరుణ్ తేజ.
ఈ యంగ్ డైరెక్టర్ ‘అశ్విన్స్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు, తరుణ్ తేజ దర్శకత్వంలో నటించేందుకు శ్రుతి హాసన్ సిద్ధమైంది. ఇక, ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ నిర్మిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన ద్వారా వెల్లడించింది. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ‘అశ్విన్స్’ సినిమా. ఈ సినిమాతోటే తరుణ్ తేజ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా విభిన్నమైన కథనం, విజువల్స్‌తో తెరకెక్కి ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం శ్రుతి హాసన్‌ను ప్రధాన పాత్రకి ఎంపిక చేసుకున్నాడు. కాగా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా తరుణ్ తేజ వ్యవహరిస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ నటించిన ‘మావీరన్’, సిద్ధార్థ్ నటించిన ‘3భ్ఖ్’ లాంటి సినిమాలను నిర్మించిన శాంతి టాకీస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాతగా అరుణ్ విశ్వ వ్యవహరించనున్నారు. శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక, ఈ సినిమా కథాంశం, జానర్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. తరుణ్ తేజ, గతంలో హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించగా.. ఈసారి శ్రుతి హాసన్‌తో ఎలాంటి కథను తెరపైకి తీసుకురాబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.

