ఆరోగ్యం

Eggs And Heart Health: గుడ్డుతో గుండెకు ముప్పు..? ఇవి కలిపి తిన్నారో ఇక అంతే!

ఇప్పటి వరకు కోడిగుడ్డు తినడం ద్వారా ఆరోగ్యానికి కలిగే మంచి విషయాలనే తెలుసుకున్నాం. అయితే, గుడ్డు(Egg)తో పాటు కొన్ని పదార్థాలను కలిపి తినడం ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డుతో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెబుతున్న వైద్యులు మనం ప్లేట్‌లో వేసుకుని తినే ఇతర ఆహారాల్లోనే హాని(Harm) దాగి వుందని స్పష్టం చేస్తున్నారు.

గుడ్డుతో పాటు వెన్న(Butter), ప్రాసెస్ చేసిన మాంసపు ముక్కలు(processed meat slices), వైట్ బ్రెడ్(white bread), వంటివి కలిపి తినే అలవాటు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 ప్లేట్‌లోని అసలు ముప్పు.. కొలెస్ట్రాల్ భయం నిజమేనా?

గుడ్డుతో కలిపి వైట్ బ్రెడ్, వెన్న, అధిక ఉప్పుతో కూడిన బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే వాటిలోని శాచ్యురేటెడ్ కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయులను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని కొలెస్ట్రాల్ కంటే ఆహారంలోని శాచ్యురేటెడ్ కొవ్వులే గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని, శరీర పనితీరుకు కొంత కొలెస్ట్రాల్ అవసరమేనని పేర్కొంటున్నారు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందన్న కారణంతో గుడ్డును పూర్తిగా పక్కన పెట్టడం సరైంది కాదని సూచిస్తున్నారు.

 పోషకాల సమాహారం.. వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చు?

తక్కువ ఖర్చుతో లభించే సహజ పోషకాహారాల్లో గుడ్డు ముఖ్యమైనదని, ఇందులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి(vitamin D), విటమిన్ బి12(vitamin B12), కెరొటినాయిడ్స్(Carotenoids),సెలీనియం ( selenium), కోలీన్(choline) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు.

గుండె జబ్బుల ముప్పు ఉన్నవారు సైతం వారానికి ఆరు గుడ్ల వరకు తినవచ్చని హార్ట్ ఫౌండేషన్ నివేదిక(Heart Foundation Report) పేర్కొనగా, సాధారణ ఆరోగ్యవంతులు రోజూ సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. గుడ్లను మానేయడం కంటే కూరగాయలు ఎక్కువగా తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శాచ్యురేటెడ్ కొవ్వులు తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తర్వాత చదవండి