Sai Pallavi: తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ కొట్టి..ఫిదా బ్యూటీగా పాపులర్ అయింది సాయి పల్లవి. ఈ సినిమా తర్వాత తెలుగులో శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ, విరాటపర్వం, ఎంసిఎ, పడి పడి లెచే మనసు లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే, తెలుగులో సినిమాలను ఒప్పుకోకుండా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన సాయి పల్లవి అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంది. కానీ, 2026లో వచ్చిన ఏ సినిమా కూడా హిందీలో సాయి పల్లవికి కలిసి రాలేదు.
సినిమాల ఎంపికలో నిత్యా మేనన్ తర్వాత సాయి పల్లవి చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఈ బ్యూటీకి ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయి పల్లవి నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ సినిమాను చూసేందుకు మెజారిటీ శాతం ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. అంతగా ఆమె తన పర్ఫార్మెన్స్ తో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే, గతకొంత కాలంగా ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయి. 2025 అనుకుంటే 2026లోనూ సాయి పల్లవి హిట్స్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా, 2026 ఎంత ప్రత్యేకమో..సినిమాల పరంగా ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదని కూడా అంతే బలంగా చెప్పాలి.
2026 లో సమ్మర్ కానుకగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ సాయి పల్లవి నటించిన ‘ఏక్ దిన్’ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అసలు, ఆమెకి హిందీ సినిమా సూటవదని కామెంట్స్ వచ్చాయి. బాలీవుడ్ ఎంట్రీ ఇలా ఉండటంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక, ఈ నవంబర్‌లో సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి.
వీటిలో బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ పార్ట్ 1’లో సాయి పల్లవి సీత పాత్రలో నటించిన సినిమా ఒకటి. ఈ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ వదిలినప్పటి నుంచే తన మీద తెగ నెగిటివిటి ప్రచారం అయింది. ఫైనల్‌గా రామాయణ హిట్ అంటున్నప్పటికీ..సాయి పల్లవికి మాత్రం ఈ సినిమా ఎలాంటి మైలేజ్ ఇవ్వలేదు. అలాగే, ధనుష్-మమ్ముట్టి నటించిన లేటెస్ట్ సినిమా ఓం కూడా ఆమెకి కలిసి రాలేదు. ఈ రకంగా 2026లో సాయి పల్లవి ఎన్నో ఆశలు పెట్టుకున్న మూడు సినిమాలు మెప్పించలేకపోవడం బ్యాడ్‌లక్ అని చెప్పాలి.
